Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పునఃప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
- By Praveen Aluthuru Published Date - 12:49 PM, Sun - 28 January 24

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన యాత్ర గురువారం ఉదయం అస్సాం నుండి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించి, విరామం తీసుకుంది. ఆ సమయంలో రాహుల్ గాంధీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.కాగా రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో న్యాయ్ మళ్ళి మొదలైంది. బస్సులో మరియు కాలినడకన సాగే యాత్ర సిలిగురి సమీపంలో రాత్రికి ఆగుతుందని కాగ్రెస్ వర్గాలు చెప్పాయి.
సోమవారం బీహార్‌లోకి ప్రవేశించే ముందు ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌కు వెళుతుంది. అలాగే జనవరి 31న మాల్దా మీదుగా పశ్చిమ బెంగాల్‌లోకి తిరిగి ప్రవేశించి, ఆపై ముర్షిదాబాద్ మీదుగా సాగుతుంది. అయితే తమ రాష్ట్రంలో ఈ యాత్ర సజావుగా జరిగేలా చూడాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటికే లేఖ రాశారు. రాష్ట్రంలో యాత్రలో భాగంగా బహిరంగ సభల నిర్వహణకు అనుమతి పొందడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉండగా రాహుల్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు సిఎం బెనర్జీ తన పార్టీ టిఎంసి రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ప్రతిపక్ష కూటమి ఇండియాలో భాగంగా కాదని ప్రకటించారు.
Also Read: Ration Card E-KYC : రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ గడువు పెంపు.. ఎప్పటివరకు ?