HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rahul Gandhi Sensational Allegations Against Cbse

Rahul Gandhi: సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

  • Author : Vamsi Chowdary Korata Date : 01-06-2026 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi Sensational Allegations Against CBSE
Rahul Gandhi Sensational Allegations Against CBSE

మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు.

ఒక్క కంపెనీ కోసం?
ఈ వివాదంపై పరిశోధన చేసిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ నివేదికను రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మే 2025లో విడుదల చేసిన సీబీఎస్ఈ టెండర్ నిబంధనల ప్రకారం.. ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కాన్లతో కనీసం 300 డీపీఐ స్పష్టతతో స్కాన్ చేయాలి. కానీ ఆగస్టులో మళ్లీ విడుదల చేసిన టెండర్‌లో ఈ రూల్స్ అన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ‘కోఎప్ట్ ఎడ్యూటెక్’ అనే ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడానికే నిబంధనలను మార్చారని ఆరోపించారు.

మొబైల్ ఫోన్లతో స్కాన్
టెండర్ మార్పుల వల్ల స్కాన్ల క్వాలిటీని 200 డీపీఐకి తగ్గించారని చివరికి సదరు సంస్థ ఆన్సర్ షీట్లను ప్రొఫెషనల్ స్కానర్లతో కాకుండా మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో పేజీలు సరిగ్గా కనిపించకపోవడం, బ్లర్‌గా మారడం, కొన్ని పేజీలు పూర్తిగా మాయమవడం వంటి దారుణాలు జరిగాయన్నారు. ఇవన్నీ పొరపాట్లు కావని, ఒక వెండర్‌కు లాభం చేకూర్చడం కోసం చేసిన పక్కా ప్లాన్ అని, ఇది ముమ్మాటికీ పెద్ద మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మౌనంపై విమర్శలు
దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఈ భారీ స్కామ్‌పై ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎథికల్ హ్యాకర్ బయటపెట్టిన లోపాలు
మరోవైపు 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి కూడా ఈ డిజిటల్ మూల్యాంకన పోర్టల్‌లోని భద్రతా లోపాలను స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టారు. ఇంటర్నెట్ ఉన్న ఎవరైనా విద్యార్థుల ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నిరూపించారు. అలాగే స్కాన్ చేసిన పేజీలపై మొబైల్ ఫోన్ల నీడలు, మడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సార్థక్ సిద్ధాంత్ కూడా ఆధారాలను బయటపెట్టారు. ప్రొఫెషనల్ స్కానర్లు వాడితే ఇలాంటి నీడలు రావడం అసాధ్యమని బోర్డును ప్రశ్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • answer sheet scanning
  • bjp party
  • cbse
  • Cong MP Rahul Gandhi
  • congress party
  • Indian PM Narendra Modi
  • Union Minister Dharmendra Pradhan

Related News

New pensions... Minister Seethakka shares good news for single women.

Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

తెలంగాణలోని అర్హులైన ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి నూతనంగా అర్హత పొందిన ఒంటరి మహిళలందరికీ కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ల పంపిణీలో ఎల

  • A flurry of appointments in the Congress... Ministerial berths confirmed for those two... Here are the contenders in the race.

    Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే

Latest News

  • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

  • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

  • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

  • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

  • The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd