PM Modi : ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు..
ఈ నెల 10వ తేదీన మోడీ ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు.
- By Latha Suma Published Date - 08:35 PM, Fri - 7 February 25

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ , అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోడీ ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంట్ రియాక్టర్‌ను ప్రధాని పరిశీలించనున్నారని మిస్రీ తెలిపారు.
Read Also: Valentine’s Day : ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి..
కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధాని పరిశీలించనున్నారని మిస్రీ తెలిపారు. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి మోడీ వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్నారు. 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం చేశాక మోడీ 27న ఆయనకు ఫోన్ చేసి అభినందించారు.
Read Also: Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడడం టైం వేస్ట్ – మంత్రి కోమటిరెడ్డి