HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >President Droupadi Murmu Speech Addressing Both Houses

Budget session : భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్ పవర్‌ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి

భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.

  • Author : Latha Suma Date : 31-01-2025 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
President Droupadi Murmu speech addressing both Houses
President Droupadi Murmu speech addressing both Houses

Budget session : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా జరిగే సమయంలో ఈ ఏడాది పార్లమెంట్ సమావేశం ప్రారంభించాం.

సైబర్ భద్రతలో సామర్థ్యాన్ని నిరూపించడానికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్, డీప్‌ఫేక్ లాంటివి సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు దేశ భద్రతకు పొంచి ఉన్న సవాళ్లు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.

ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో పేదలు, మహిళలు, రైతులతో పాటు యువతకు అధిక ప్రాధాన్యత ఉండనుంది. పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు అందించాం. వారి సొంతింటి కలను ఎన్డీయే సర్కార్ నేర్చిందన్నారు. ఇక, రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సర్వే గత సంవత్సరంలో ప్రభుత్వం పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్ట్‌కార్డ్‌ లాంటిది. ఈ సర్వే జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది. ఇక రేపు అంటే శనివారం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.

Read Also: Parliament : ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Both houses
  • budget session
  • global innovation powerhouse
  • india
  • lok sabha
  • parliament
  • President Draupadi Murmu

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • Parliament Monsoon Session; possibility of introducing Women's Reservation and Constituency Delimitation bills.

    Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd