Three Warships Commissioned : ‘‘వికాసం కావాలి.. విస్తరణ కాదు’’.. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోడీ
సముద్ర మార్గాలను భద్రంగా ఉంచడంలో, వాటి మీదుగా వాణిజ్య రవాణాలు సురక్షితంగా జరిగేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది’’ అని ప్రధాని(Three Warships Commissioned) చెప్పారు.
- By Pasha Published Date - 12:11 PM, Wed - 15 January 25

Three Warships Commissioned : ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్‌గిరి, ఐఎన్ఎస్ వాఘ్ శీర్ యుద్ధ నౌకలు భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి చేరాయి. ఈ మూడు యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ముంబై నగరం వేదికగా జాతికి అంకితమిచ్చారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇవి మూడు కూడా మేడిన్ ఇండియా యుద్ధనౌకలే. వీటిలో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రిగేట్, ఇంకోటి సబ్ మెరైన్. ఇవన్నీ కలిపి ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పుడు నౌకాదళ శక్తిపరంగా భారత్ మరింత బలోపేతమైంది. గ్లోబల్ సౌత్‌లో నమ్మదగిన, బాధ్యతాయుత భాగస్వామిగా భారత్‌ను ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. భారత్ సైనిక శక్తిని పెంచుకుంటున్నది కేవలం వికాసం కోసమే. అంతేతప్ప విస్తరణవాదం కోసం కాదు’’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
#WATCH | Mumbai, Maharashtra: Prime Minister Narendra Modi dedicates three frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation
(Source: ANI/DD) pic.twitter.com/0PI3kxlVT4
— ANI (@ANI) January 15, 2025
Also Read :CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
‘‘సురక్షితమైన, వికాసశీలమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ కోరుకుంటోంది. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కీలక భూమిక పోషించబోతోంది. సముద్ర మార్గాలను భద్రంగా ఉంచడంలో, వాటి మీదుగా వాణిజ్య రవాణాలు సురక్షితంగా జరిగేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది’’ అని ప్రధాని(Three Warships Commissioned) చెప్పారు. ‘‘భారత నౌకాదళం సముద్ర జలాల మీదుగా ఆయుధాలు, డ్రగ్స్ రవాణా జరగకుండా అడ్డుకుంటుంది. టెర్రరిజానికి ఊతం లభించకుండా చేస్తుంది. భారత్‌ను సురక్షిత స్థానంగా మారుస్తుంది’’ అని ఆయన తెలిపారు. ‘‘గత పదేళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను మేం అందుబాటులోకి తెచ్చాం’’ అని మోడీ వెల్లడించారు. అంతకుముందు ఎక్స్ వేదికగా మోడీ ఒక పోస్ట్ చేశారు. ఈ యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం వల్ల దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు. యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ పట్టు సాధిస్తోందన్నారు.