Hafiz Saeed : ఆ ముష్కరుడి కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి !
సోనామార్గ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జునైద్ అహ్మద్ భట్(Hafiz Saeed) పేరు తెరపైకి వచ్చింది.
- By Pasha Published Date - 01:09 PM, Fri - 25 April 25

Hafiz Saeed : కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడితో ముడిపడిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని అంటున్నారు. లష్కరే తైబాకు అనుబంధంగా కశ్మీరులో పనిచేస్తున్న ఓ ముసుగు సంస్థతో ఈ దాడిని హఫీజ్ సయీద్ చేయించారు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో కొందరు కశ్మీరీలు కాగా, ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులే ఉన్నారు. 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు తెలిసే ఇదంతా జరిగిందని సమాచారం. పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్‌లో చాలాకాలంగా చాపకింద నీరులా తయారవుతున్న ఉగ్రవాద మాడ్యూల్‌ను ఈ దాడి తెరపైకి తెచ్చింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరులో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే.
Also Read :Attack : భారత్ సైన్యాన్ని చంపేందుకు భారీ ప్లాన్..తృటిలో తప్పించుకున్న సైన్యం
సోనామార్గ్, బూటా పథ్రి ఉగ్రదాడులకు కొనసాగింపేనా ?
భారత భద్రతా సంస్థల కథనం ప్రకారం.. పహల్గామ్ ఉగ్రదాడి(Hafiz Saeed)ని, అంతకుముందు జమ్మూకశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వరుస ఉగ్రదాడుల నుంచి వేరు చేసి చూడలేం. సోనామార్గ్, బూటా పథ్రి, గండేర్బల్ ఉగ్రదాడి ఘటనలకు కొనసాగింపుగానే, పహల్గామ్ దాడికి ఉగ్రసంస్థలు పాల్పడి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. 2024 అక్టోబరులో కశ్మీరులోని బూటా పథ్రి వద్ద జరిగిన ఉగ్రదాడిలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు సైనికులు ఉన్నారు. అదే నెలలో సోనామార్గ్‌లో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది హాషిం మూసా.. పహల్గామ్ ఉగ్రదాడిలోనూ పాల్గొన్నాడనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Also Read :Blood Pressure: బీపీ ఎక్కువున్న వాళ్లు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో మీకు తెలుసా?
ఉగ్రదాడి చేశాక అడవుల్లో దాక్కొని..
సోనామార్గ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జునైద్ అహ్మద్ భట్(Hafiz Saeed) పేరు తెరపైకి వచ్చింది. కశ్మీరులోని కుల్గాంకు చెందిన ఇతగాడు ఏ ప్లస్ కేటగిరీ లష్కరే తైబా ఉగ్రవాది. 2024 డిసెంబరులో జునైద్‌ను దచిగాం వద్ద భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. అయితే ఆ సమయంలో అతడి వెంట ఉన్నవారు అడవుల్లోకి తప్పించుకోగలిగారు. ఉగ్రదాడి చేశాక అడవుల్లోకి వెళ్లి దాక్కోవడం ఈ మిలిటెంట్ల ప్రత్యేకత. పాకిస్తాన్‌లో ఉండే తమ హ్యాండ్లర్ల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాళ్లు అడవుల్లోనే ఉండిపోతారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్ర మిలిటెంట్లు చేసింది కూడా అదే. కశ్మీరులో ఈ తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులందరికీ పాకిస్తాన్‌లో ఉన్న లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్, డిప్యూటీ చీఫ్ సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. కశ్మీరులోని ఉగ్రవాదులకు ఆయుధాలను చేరవేయడం, దాడులకు సంబంధించిన ప్లానింగ్‌ను అందించడం వంటివన్నీ పాకిస్తాన్ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్ఐలే చేస్తుంటాయని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీరులోని స్థానిక ఉగ్రవాదులను వాడుకుంటున్నట్లు వెల్లడైంది.
ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తానీలే
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు గురువారం విడుదల చేశారు. వారిలో ఇద్దరు పాకిస్తానీయులు. పాకిస్తానీ ఉగ్రవాదుల పేర్లు.. హాషిం మూసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా అని వెల్లడించారు. మరో ఉగ్రవాది పేరు.. అబ్దుల్ హుసేన్ థోకర్. ఇతగాడు కశ్మీరులోని అనంత్ నాగ్ వాస్తవ్యుడు. ఈ ఉగ్రవాదుల ఆచూకీని చెప్పే వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఉగ్రదాడికి ముందు ఈ ముగ్గురు టెర్రరిస్టులు ఓ అడవిలో దాక్కున్నట్లు గుర్తించారు.