HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Foods That People With High Bp Should Avoid

Blood Pressure: బీపీ ఎక్కువున్న వాళ్లు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో మీకు తెలుసా?

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తినకూడదని, వాటి వల్ల బీపీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 25-04-2025 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Blood Pressure
Blood Pressure

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో బీపీ సమస్య కూడా ఒకటి. హైబీపీ,లోబీపీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ హైబీపీ,లోబీపీ కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాగా హైబీపీ లైట్ తీసుకునేంత చిన్న సమస్య కాదు. ఎందుకంటే ఈ వ్యాధి మన ప్రాణాలను రిస్క్ లో పెడుతుందట. అందుకే ఈ సమస్య ఉన్నవారు రక్తపోటు అదుపులో ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో కేవలం పెద్దలు మాత్రమే కాకుండా చిన్న వయసు వారు కూడా హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు.

అధిక రక్తపోటు కారణంగా కొన్నిసార్లు గుండెపోటు, స్ట్రోక్,డయాబెటిస్ ప్రాణాంతక సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ వ్యాధిని బాగా కంట్రోల్ చేయాలట. పెరకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అధిక రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందట. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం డయాబెటీస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెబుతున్నారు. అయితే అధిక రక్తపోటు సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వైట్ బ్రెడ్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.

కానీ వైట్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లతో పాటుగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఫాస్ట్ గా పెంచుతాయట. అలాగే ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా డేంజర్ అని చెబుతున్నారు. ఇది రక్తపోటును కూడా బాగా పెంచుతుంది. వైట్ బ్రెడ్ ను అతిగా తింటే బరువు పెరుగుతారని చెబుతున్నారు. కాగా వైట్ బ్రెడ్ మాదిరిగానే వైట్ రైస్ లో కూడా పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయట. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని, అలాగే రక్తపోటు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. వైట్ రైస్ ను రెగ్యులర్ గా తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట. అందుకే దీనికి బదులుగా బ్రౌన్ రైస్, బార్లీ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలని చెబుతున్నారు. ఇవి బీపీని, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట.

వైట్ పాస్తా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతుందట. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా వైట్ పాస్తాను తినకూడదని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది చాలా డేంజర్. వైట్ పాస్తా వేగంగా జీర్ణమయ్యి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుందట. ఇది బరువు పెరగడానికి, రక్తపోటు పెరగడానికి కారణమవుతుందట. బంగాళాదుంపలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచుతాయట. అధిక రక్తపోటు ఉన్న రోగులు కూడా వీటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే బంగాళాదుంపల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర ను వివిధ రకాల ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. దీన్ని ఎక్కువగా వివిధ ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాల్లో వేస్తుంటారు. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట. ఇది బరువు పెరగడానికి దారితీస్తుందని, అలాగే బీపీ కూడా పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుందని చెబుతున్నారు. .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • blood pressure
  • health tips
  • high blood pressure

Related News

Heart Attack Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • Health Tips

    నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Latest News

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

  • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd