India
-
Visas: ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ!
ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేయడంతోపాటు OCI పోర్టల్‌ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Date : 13-08-2025 - 6:28 IST -
Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..
భారత్ ప్రకటన ప్రకారం, సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) 1960లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించబడిన ద్వైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందంపై తగినంత స్పష్టత ఉండగా, దీనిపై తృతీయ పక్షాల హస్తక్షేపానికి ఆస్కారం లేదని భారత్ స్పష్టం చేసింది.
Date : 13-08-2025 - 4:58 IST -
China-India : ట్రంప్ చర్యలు..భారత్-చైనా మధ్య వ్యాపార సంబంధాలు బలపడుతున్నాయా?
దీని ప్రభావంగా భారత్-చైనా మధ్య వాణిజ్య భాగస్వామ్యం గట్టిపడుతోంది. ఈ పరిణామాల్లో నయార ఎనర్జీ (Nayara Energy) కీలక పాత్ర పోషిస్తోంది. గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీని కలిగి ఉన్న ఈ సంస్థలో రష్యా పెట్రోలియం దిగ్గజం రోస్‌నెఫ్ట్‌కి 49 శాతం వాటా ఉంది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలు ఈ సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Date : 13-08-2025 - 4:04 IST -
Sonia Gandhi : సోనియాగాంధీకి ఇటలీ పౌరురాలిగా ఓటు.. బీజేపీ ఎదురుదాడి
Sonia Gandhi : ఇతర రాష్ట్రాల ఎంపికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ యుద్ధం ఘర్షణలకు దారి తీసింది.
Date : 13-08-2025 - 2:07 IST -
Dharmasthala : ధర్మస్థల కేసు.. సస్పెన్స్ లో SIT..! నిజాలు బయటపడతాయా..!
Dharmasthala : కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరుగుతున్న మాస్ గ్రేవ్ (సామూహిక ఖననం) కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బుధవారం నుంచి చివరి దశ తవ్వకాలను ప్రారంభించనుంది.
Date : 13-08-2025 - 1:06 IST -
Stray Dogs : వీధి కుక్కల తొలగింపు తీర్పుపై తీవ్ర విమర్శలు.. సుప్రీం తీర్పు పరిశీలిస్తానన్న సీజేఐ
ఈ నేపథ్యంలో, ఈ అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రేబిస్ కారణంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కీలక తీర్పును వెలువరించింది.
Date : 13-08-2025 - 1:00 IST -
Retail Inflation : మధ్యతరగతికి శుభవార్త..ఎనిమిదేళ్లలోనే కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం..!
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 జులై నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైంది. ఇది 2017 జులై తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత జూన్‌లో ఈ రేటు 2.10 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదవడం విశేషం. ఇది వరుసగా తొమ్మిదోసారి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.
Date : 13-08-2025 - 10:54 IST -
PM Modi : టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లనున్నారు.
Date : 13-08-2025 - 9:10 IST -
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
Date : 12-08-2025 - 10:04 IST -
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై
మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అని వెల్లడించారు.
Date : 12-08-2025 - 4:19 IST -
Bangladesh : బంగ్లాదేశ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రం..భారత్ కీలక నిర్ణయం
డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం, జనుముతో తయారైన వస్త్రాలు, జనపనార తాళ్లు, గోనె సంచులు, ఇతర నార ఉత్పత్తులు భూ మార్గం ద్వారా భారత్‌కు దిగుమతి చేయరాదని స్పష్టం చేసింది. ఇకపై ఈ ఉత్పత్తులు కేవలం నవీ ముంబైలోని నవా షేవా ఓడరేవు ద్వారానే దిగుమతికి అనుమతి ఉంటుంది.
Date : 12-08-2025 - 2:13 IST -
Justice Yashwant Varma : నోట్ల కట్టల వ్యవహారం..జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియ ప్రారంభం
న్యాయవ్యవస్థలో పారదర్శకత అత్యంత కీలకం. ఇటువంటి ఘటనలపై నిర్దాక్షిణ్యంగా విచారణ జరగాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా నియమితులయ్యారు.
Date : 12-08-2025 - 1:27 IST -
Election Commission : మరో 476 రాజకీయ పార్టీల రద్దుకు ఈసీ నిర్ణయం
Election Commission : క్రమంగా దేశ వ్యాప్తంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు తీసుకుంటోంది.
Date : 12-08-2025 - 11:18 IST -
Income Tax Bill : ఇన్ కం టాక్స్ బిల్లు-2025లో ఏం మారాయో తెలుసా..?
Income Tax Bill : కేవలం పదాల మార్పు తప్ప పన్నుల విధానంలో లేదా పన్ను శ్లాబులలో ఎటువంటి మార్పులు లేవు. ఈ మార్పులు ఇన్కమ్ టాక్స్ విధానంలో పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి.
Date : 12-08-2025 - 8:15 IST -
Income Tax bill : ఆదాయపు పన్ను చట్టానికి నూతన రూపం.. 1961 చట్టానికి వీడ్కోలు పలికే దిశగా కేంద్రం అడుగు
వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో, దాన్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. కమిటీ తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించగా, దానిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం పలు మార్పులు చేసి, బిల్లును తాజా రూపంలో మళ్లీ లోక్‌సభకు తీసుకొచ్చింది.
Date : 11-08-2025 - 3:34 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలకు పాల్పడుతున్నారు.
Date : 11-08-2025 - 3:01 IST -
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Date : 11-08-2025 - 2:39 IST -
Operation Sindoor : పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి.. వీడియో విడుదల చేసిన వాయుసేన
ఐఏఎఫ్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో పహల్గాం దాడి దృశ్యాలు, దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చేపట్టిన వైమానిక దాడులు, ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు వంటి ఘట్టాలను స్పష్టంగా చూపించారు. ఈ వీడియో ద్వారా ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ప్రజల్లోకి వచ్చాయి.
Date : 11-08-2025 - 2:29 IST -
Cat Kumar : బీహార్‌లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!
దరఖాస్తుదారుడి పేరు "క్యాట్ కుమార్", తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కటియా దేవి". ఈ సమాచారం స్థానిక అధికారులకు అందిన వెంటనే, రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్ స్పందించారు. ఇలాంటి అసంబద్ధమైన, నకిలీ దరఖాస్తులు అధికార వ్యవస్థను అపహాస్యంలోకి నెడుతున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 11-08-2025 - 1:39 IST -
Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నాగ్‌పుర్‌కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం నాడు లోనారా నుంచి కరణ్‌పుర్ దిశగా ప్రయాణిస్తున్నాడు. వారి ప్రయాణ మార్గం నాగ్‌పుర్-జబల్‌పుర్ జాతీయ రహదారి.
Date : 11-08-2025 - 1:13 IST