Shocking : మనవడినే బలి ఇచ్చిన తాతయ్య.. షాకింగ్ నిజాలు
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర హత్యా ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్‌ను అమానుషంగా హత్య చేసిన ఈ కేసు రోజురోజుకు కొత్త కొత్త విషయాలను బయటపెడుతోంది.
- By Kavya Krishna Published Date - 11:24 AM, Mon - 1 September 25

Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర హత్యా ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్‌ను అమానుషంగా హత్య చేసిన ఈ కేసు రోజురోజుకు కొత్త కొత్త విషయాలను బయటపెడుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు సరణ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ఈ హత్య వెనుక అసలు కారణంగా నిలిచిన మంత్రగాడి పాత్ర వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి యశ్ (17) తన తాతయ్య సంబంధం కలిగిన సరణ్ సింగ్ ఇంటికి ఆగస్టు 26న స్కూల్‌కి వెళ్ళే సమయంలో వెళ్లాడు. ఆ సమయంలో సరణ్ సింగ్ అతన్ని పాశవికంగా హత్య చేసి శవాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారవేశాడు. ఈ ఘటన మొత్తం జిల్లాలో కలకలం రేపింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించగా, ఈ హత్య వెనుక తాంత్రికుడు మున్నాలాల్ (45) సూచన ఉందని తేలింది.
Chandra Grahan 2025 : చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు !!
కౌశాంబీ జిల్లాలోని ధుస్కహా గ్రామానికి చెందిన మున్నాలాల్ తాంత్రిక విద్యల పేరుతో ప్రజలను మోసం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సరణ్ సింగ్ కుటుంబంలో వరుసగా జరిగిన ఆత్మహత్యల కారణంగా అతను మానసికంగా కుంగిపోవడంతో, ఇంట్లో చెడు శక్తుల ప్రభావం ఉందని మున్నాలాల్ చెప్పి మోసం చేశాడు. చెడుఆత్మల నుంచి విముక్తి పొందాలంటే బలి అవసరం అని చెప్పి, తన మనవడినే బలి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా శవాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి వేర్వేరు దిశల్లో పడేయమని కూడా సూచించాడు.
ఈ వివరాలు బయటపడిన వెంటనే పోలీసులు మున్నాలాల్ కోసం గాలింపు చేపట్టి, ఆదివారం సాయంత్రం కరేలీ లేబర్ చౌరాహా వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు సరణ్ సింగ్ జైలులో ఉండగా, ఇప్పుడు మంత్రగాడు పట్టుబడటంతో దర్యాప్తు మరింత వేగం తీసుకుంది. ఒక తాతయ్య తన మనవడిని తాంత్రికుడి బలి కోసం హత్య చేయడం సమాజాన్ని కుదిపేసింది. మాంత్రిక మోసాల పేరుతో అమాయక విద్యార్థి ప్రాణం బలైపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మళ్లీ ఒకసారి తాంత్రిక నమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సంచలన ప్రకటన..కారణం అదేనా..?