OLA: షోరూమ్ ముందే OLA బైక్ తగలబెట్టాడు..ఎందుకంటే !!
OLA: పాలన్పూర్ ఘటన, వినియోగదారుల విశ్వాసం దెబ్బతినడానికి కారణమైంది. కంపెనీలు నాణ్యత నియంత్రణ, సర్వీస్ రెస్పాన్స్‌లో మరింత బాధ్యత చూపించకపోతే, భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది
- By Sudheer Published Date - 10:45 AM, Thu - 9 October 25

గుజరాత్ రాష్ట్రంలోని పాలన్పూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి తన ఓలా ఎలక్ట్రిక్ బైక్‌పై తీవ్ర ఆగ్రహంతో షోరూమ్ ఎదుటే దానికి నిప్పంటించాడు. అసలు ఏంజరిగిందంటే.. సదరు వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి బైక్‌పై బయటకు వెళ్తుండగా బైక్ స్టీరింగ్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. ఇది కేవలం ప్రమాదకర పరిస్థితి మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న ఘటన. వెంటనే షోరూమ్‌కు తీసుకెళ్లిన ఆయన, ఈ లోపం గురించి పునరావృతంగా వివరించినప్పటికీ, షోరూమ్ సిబ్బంది దానిని పట్టించుకోలేదని తెలిపారు.
Donate: దాన ధర్మాలు కుడి చేతితోనే ఎందుకు చేయాలి.. ఎడమ చేయి ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా?
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన తరువాత నుంచి వాహనంలో సమస్యలు వస్తూనే ఉన్నాయని, అయితే సర్వీస్ సెంటర్ స్పందన నిర్లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎవరూ దానిని సరిచేయలేదని, కంపెనీ కస్టమర్ కేర్ కూడా తగిన సహాయం అందించలేదని ఆయన ఆరోపించారు. ఈ నిర్లక్ష్యం, అగౌరవ భావనతో ఆగ్రహించిన వినియోగదారు చివరికి షోరూమ్ ఎదుటే బైక్‌ను తగులబెట్టి తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రజల దృష్టి మళ్లీ ఓలా కంపెనీ భద్రతా ప్రమాణాలపై పడింది.
ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ వాహనాల భద్రత, నాణ్యతపై అనేక వినియోగదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొంతమంది వినియోగదారులు వాహనాల్లో టెక్నికల్ ఫాల్ట్స్, సాఫ్ట్‌వేర్ గ్లిచ్‌లు, బ్యాటరీ హీట్ సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. పాలన్పూర్ ఘటన, వినియోగదారుల విశ్వాసం దెబ్బతినడానికి కారణమైంది. కంపెనీలు నాణ్యత నియంత్రణ, సర్వీస్ రెస్పాన్స్‌లో మరింత బాధ్యత చూపించకపోతే, భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. వినియోగదారుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవడం, ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది కంపెనీలకు ఇప్పుడు అత్యవసరం.