Karnataka: ఎన్నికలకు ముందు కర్ణాటకలో 40 కేజీల బంగారం పట్టివేత..!
కర్ణాటక (Karnataka)లోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల సంఘం అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
- By Gopichand Published Date - 07:42 AM, Fri - 21 April 23

కర్ణాటక (Karnataka)లోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల సంఘం అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.51కోట్లని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో మొత్తం 40.59 కేజీల బంగారం, 20.7కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో మొత్తం మీద ఇప్పటివరకూ 1,714 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని అధికారులు వివరించారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు చిక్కమగళూరు జిల్లాలోని తరికెరె అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం రూ.23.51 కోట్ల విలువైన 40 కిలోలకు పైగా బంగారం, 20 కిలోలకు పైగా వెండిని స్వాధీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో 40.59 కిలోల బంగారం, 20.7 కిలోల వెండిని ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ టీమ్ స్వాధీనం చేసుకుంది. మార్చి 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కర్ణాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దాదాపు రూ.240 కోట్లను స్వాధీనం చేసుకున్నాయి.
Also Read: Bilawal Bhutto: భారత పర్యటనకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. కారణమిదే..?
ఇందులో రూ.80 కోట్ల నగదు, రూ.48 కోట్ల మద్యం, రూ.78 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.19 కోట్ల విలువైన బహుమతులు, రూ.16 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి. జప్తులకు సంబంధించి 1,714 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే (మార్చి 9 నుంచి మార్చి 27 వరకు) దాదాపు రూ.58 కోట్లు పట్టుబడ్డాయి. కర్నాటకలో మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.