HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Why Pakistan Foreign Minister Bilawal Bhutto Zardaris Coming India Visit Is Significant

Bilawal Bhutto: భారత పర్యటనకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. కారణమిదే..?

భారత్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) పాల్గొనడంపై భారత్ (India) గురువారం ఒక ప్రకటన చేసింది.

  • By Gopichand Published Date - 07:22 AM, Fri - 21 April 23
  • daily-hunt
Bilawal Bhutto
Resizeimagesize (1280 X 720) 11zon

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత పాకిస్థాన్ నాయకుడు అధికారిక పర్యటన నిమిత్తం భారత్ కు వస్తున్నారు. భారత్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) పాల్గొనడంపై భారత్ (India) గురువారం ఒక ప్రకటన చేసింది. పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ వచ్చే నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. మే 4-5 తేదీల్లో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ విదేశీ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్ ఆహ్వానం మేరకు భుట్టో పర్యటన ఖరారైందని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం ప్రకటించింది. అన్ని దేశాల మాదిరిగానే పాక్ మంత్రికీ ఆహ్వానం పంపినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మే 4-5 తేదీల్లో భారతదేశంలోని గోవాలో జరిగే SCO కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (CFM) సమావేశానికి బిలావల్ భుట్టో జర్దారీ పాక్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని బలూచ్ చెప్పారు. దీంతో భుట్టో వ్యక్తిగతంగా సదస్సుకు హాజరవుతాడా లేదా అనే ఊహాగానాలకు వారం రోజులుగా తెరపడింది. బలూచ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జర్దారీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆహ్వానం మేరకు సదస్సుకు హాజరవుతారు.గతంలో 2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు.

ఫిబ్రవరి 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఆ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా ఉద్రిక్తంగా మారాయి. ఆగస్టు 2019లో భారతదేశం జమ్మూ మరియు కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంది. దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో మరింత చేదు ఏర్పడింది.

Also Read: Hiking Prices: వామ్మో.. కేజీ దొండకాయలు రూ.900 కంటే ఎక్కువ.. నెట్టింట ఫోటో వైరల్..!

పాకిస్థాన్‌తో పొరుగుదేశాల మధ్య సాధారణ సంబంధాలే ఉండాలని భారత్‌ చెబుతోంది. అయితే, మరోవైపు అటువంటి సంబంధాల కోసం ఉగ్రవాదం, ఉద్రిక్తత లేని వాతావరణాన్ని సృష్టించడం పాకిస్తాన్ బాధ్యత అని నొక్కి చెప్పారు. 2011లో అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. మే 2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చారు.

వార్తా సంస్థ PTI ప్రకారం.. SCO 2001లో షాంఘైలో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశంలో స్థాపించబడింది. తరువాతి సంవత్సరాలలో ఇది అతిపెద్ద ప్రాంతీయ సంస్థలలో ఒకటిగా ఉద్భవించింది. 2017లో చైనాలోని SCOలో భారతదేశం, పాకిస్తాన్ శాశ్వత సభ్యత్వం పొందాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bilawal Bhutto Zardari
  • india
  • pakistan
  • Pakistan Foreign Minister
  • SCO
  • world news

Related News

Afghanistan-Pakistan War

Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.

  • Pm Modi Trump Putin

    Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

  • Ex Soldier India

    Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

  • Donald Trump Nobel Peace Pr

    Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

  • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd