HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >On February 05 Aap Sarkar Aayegi Bjp Sarkar Aayegi All The People Of Delhi Say Pm Modi

Assembly Election : ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీ ప్రజలు అంటున్నారు: ప్రధాని

ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు.

  • By Latha Suma Published Date - 03:56 PM, Wed - 29 January 25
  • daily-hunt
PM Modi
PM Modi

Assembly Election : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ఉధృతం చేశాయి. ఈ మేరకు ఢిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 05న ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీలోని ప్రజలంతా అంటున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రజలకోసం ఇళ్లు నిర్మించే ప్రభుత్వం ఢిల్లీకు కావాలి. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులకోసం మా మేనిఫెస్టోలో పథకాలు రూపొందించాం అని అన్నారు. అబద్ధపు వాగ్దానాలు, మోసాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు. ఈరోజు వరకు కూడా ఢిల్లీలో ఆవే రోడ్ జామ్‌లు, వీధుల్లో మురికినీరు, కలుషిత తాగునీరు పరిస్థితి ఉందని, తాము 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి, మరో 25 ఏళ్లు పనులు కొనసాగించనున్నామని చెప్పారు.

ఇక, ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మండిపడ్డారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా? అని ప్రశ్నించారు. యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందన్నారు. చరిత్ర ఎన్నటికీ వాళ్లను క్షమించదు. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు. బీజేపీ మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది అని మోడీ అన్నారు. యమున పేరుతో ఓట్లడిగారు. ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీని నీళ్లు అడుక్కునేలా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాపాలకు పాల్పడుతున్నారు. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా? అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తుంది? ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారు.. అని మోడీ పేర్కొన్నారు.

Read Also: Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఇదేం కెప్టెన్సీ..?

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aam Aadmi Party (AAP)
  • assembly election
  • bjp
  • delhi
  • election campaign
  • pm modi

Related News

Jublihils Campign

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది ఆ పార్టీనే – KK సర్వే కీలక రిపోర్ట్

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ (BRS) మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నేరుగా పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది

  • Rename Delhi

    Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

  • Jubli Campgin

    Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో తగ్గేదేలే అంటూ నేతల ప్రచార హోరు

  • Sardar Vallabhbhai Patel

    Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!

  • MP Chamala

    MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Latest News

  • Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

  • Foot Soak: ఇలా చేస్తే నొప్పి, అలసట నిమిషాల్లో మాయం!

  • 1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

  • Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • 20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

Trending News

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd