Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఇదేం కెప్టెన్సీ..?
గత మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జరిగింది. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మను మూడో మ్యాచ్‌లో నాలుగో స్థానంలోకి పంపారు.
- Author : Naresh Kumar
Date : 29-01-2025 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
Suryakumar Yadav: వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ను 26 పరుగుల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సిరీస్‌లో పునరాగమనం చేసింది. మూడో టీ20లో ఓటమికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని చెప్పొచ్చు.
ఫస్ట్ టీమిండియా ఒకే ఒక్క పేసర్‌తో బరిలోకి దిగింది. అర్ష్ దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీకి తుది జట్టులో అవకాశం కల్పించారు. 14 నెలల తర్వాత షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయకపోగా 3 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు ఇచ్చాడు. స్పిన్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై వాషింగ్టన్ సుందర్‌కు బౌలింగ్ చేయడానికి ఒకే ఒక ఓవర్ ఇచ్చారు. అయితే బ్యాటింగ్ లో సుందర్ ఆకట్టుకోలేకపోయాడు. కీలక దశలో 15 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత బ్యాటింగ్ పై ఒత్తిడి పెరిగింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్‌కు 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఇది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపింది. జురెల్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేశాడు. జురెల్‌ను 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు పంపితే రిజల్ట్ మరోలా ఉండేది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పై మండిపడ్డ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్
గత మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జరిగింది. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మను మూడో మ్యాచ్‌లో నాలుగో స్థానంలోకి పంపారు. ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో ఇద్దరూ విఫలమయ్యారు. స్కై 7 బంతుల్లో 14 పరుగులు, తిలక్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు సాధించారు. దీంతోపాటు భారత్ బ్యాటింగ్‌లో భాగస్వామ్యం లోపించింది. వరుస వికెట్లు కోల్పోవడం ద్వారా జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. పదునైన బంతుల్ని సంధిస్తూ టీమిండియా బ్యాటింగ్ దళాన్ని పేకమేడలా కూల్చారు. ఒకదశలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. వీరిద్దరూ కాస్త నిలకడగా ఆడి ఉంటే ఐదు మ్యాచ్ ల సిరీస్ మూడు సున్నాతో మనకే దక్కేది.