First Drone Attack : భద్రతా దళాలపై తొలిసారిగా డ్రోన్ దాడి.. మణిపూర్‌కు ఎన్‌ఎస్‌జీ నిపుణులు
మన దేశంలోనే తొలిసారిగా మణిపూర్ ఉగ్రవాదులు డ్రోన్‌తో భద్రతా దళాలపైకి దాడికి తెగబడ్డారు.
- By Pasha Published Date - 03:17 PM, Wed - 4 September 24
First Drone Attack : ఉగ్రవాదం విషయంలో కశ్మీర్‌ను మణిపూర్ మించిపోయింది. మన దేశంలోనే తొలిసారిగా మణిపూర్ ఉగ్రవాదులు డ్రోన్‌తో భద్రతా దళాలపైకి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. మణిపూర్ ఉగ్రమూకలను ఆదిలోనే నియంత్రించేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) నిపుణులను అక్కడికి పంపింది. ఈవివరాలను మణిపూర్ డీజీపీ రాజీవ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు.
Also Read :Narayana Murthy : మీలా కావాలంటే ఏం చేయాలన్న విద్యార్థి.. నారాయణమూర్తి సూపర్ ఆన్సర్
ఇంతకీ మణిపూర్ ఉగ్రవాదుల చేతికి సాయుధ డ్రోన్లు ఎలా అందాయి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈవిధమైన పెద్ద ఆయుధాలను ఉగ్రవాదులను వాడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీన్ని దేశ భద్రతకు పెనుముప్పుగా పరిగణిస్తున్నారు. మణిపూర్ సమీపంలోనే ఉన్న మయన్మార్ నుంచి ఉగ్రవాదులకు ఈ డ్రోన్లు అంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సాయుధ డ్రోన్ల వినియోగంపై మణిపూర్ ఉగ్రవాదులకు ఎవరు శిక్షణ ఇచ్చారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
We’re now on WhatsApp. Click to Join
మణిపూర్‌లోని మేకాంగ్ గ్రామంపై ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడుల్లో(First Drone Attack) మూడు ఇండియన్ రిజర్వు బెటాలియన్ల బంకర్లు దెబ్బతిన్నాయి. ఈ బంకర్ల నుంచి ఉగ్రవాదులు ఇన్సాస్, ఏకే 47, లైట్ మెషీన్ గన్లను అపహరించారు. ఈ దాడులకు ఉగ్రవాదులు రోటర్ ఫిటెడ్ క్వాడ్‌కాప్టర్లు వినియోగించారని వెల్లడైంది.సాధారణంగా ఈ డ్రోన్లను ఫొటోలు తీయడానికి వాడుతారు. ఆ డ్రోన్లలో మార్పులు చేసి ఈ దాడికి వాడారని సమాచారం. హోబ్బీ ఎఫ్‌పీవీ రకానికి చెందిన సాయుధ డ్రోన్లపై పేలుడు పదార్థాలను అమర్చే ఛాన్స్ కూడా ఉంటుంది. వీటిని దాదాపు 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి శత్రు లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు. ఇంకొన్ని మార్పులు చేస్తే దాదాపు 15 కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేయొచ్చు. మొత్తం మీద మణిపూర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు పెరగడం అనేది ఈశాన్య భారతదేశంలో ఆందోళన రేకెత్తిస్తోంది.
Also Read :30 Officials Executed : 30 మంది అధికారులను ఉరితీసిన కిమ్.. ఎందుకో తెలుసా ?
Related News
Who Is Himanshu Singh: ప్రాక్టీస్ మ్యాచ్ కోసం స్టార్ బౌలర్ ని దించుతున్న బీసీసీఐ
Himanshu Singh: టీమిండియా సన్నద్ధత కోసం బీసీసీఐ ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను పిలిచింది. అతను రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీతో సహా అందరికీ బౌలింగ్ చేయనున్నాడు. ఇటీవలి పలు ప్రాక్టీస్ మ్యాచ్ లలో తన బౌలింగ్‌తో బ్యాట్స్మెన్లను ఆశ్చర్యపరిచిన హిమాన్షు సింగ్ కి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది.