30 Officials Executed : 30 మంది అధికారులను ఉరితీసిన కిమ్.. ఎందుకో తెలుసా ?
జులై నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలను నిలువరించడంలో విఫలమైనందుకు ఆ అధికారులను ఉరితీయాలని కిమ్ ఆర్డర్స్ ఇచ్చారు.
- By Pasha Published Date - 01:38 PM, Wed - 4 September 24

30 Officials Executed : ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్‌జోంగ్ ఉన్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. 30 మంది ప్రభుత్వ అధికారులను ఉరితీయాలను కిమ్ ఆదేశాలు జారీ చేశారు. జులై నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలను నిలువరించడంలో విఫలమైనందుకు ఆ అధికారులను ఉరితీయాలని కిమ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇటీవలే ఉత్తర కొరియాలో సంభవించిన వరదల్లో దాదాపు 1000 మందికిపైగా(30 Officials Executed) ప్రజలు చనిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కిమ్.. ఆయా ప్రభావిత ప్రాంతాలను పాలించే అధికారులకు ఉరిశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read :Vinesh Phogat : కాంగ్రెస్‌లో చేరిన వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా
ప్రజల ప్రాణాలను విపత్తుల నుంచి కాపాడలేని అధికారులకు జీవించే హక్కులేదని కిమ్ స్పష్టం చేశారు. ఆయా అధికారులపై అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అభియోగాలను కూడా మోపారు. కిమ్ ఆదేశాల అమలులో భాగంగా గతనెల చివర్లోనే ఆ 30 మంది అధికారులకు ఉరిశిక్షను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు వివరాలతో దక్షిణ కొరియా మీడియాలో సంచలన కథనాలు ప్రచురితమయ్యాయి. అధికారులందరికీ ఒకేసారి ఉరిశిక్ష విధించారని ఆ కథనాల్లో ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join
ఉరితీసిన అధికారుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారని పేర్కొన్నారు. ఉరిశిక్షను ఎదుర్కొన్న ఆఫీసర్ల జాబితాలో ఉత్తర కొరియాలోని చాగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన కాంగ్ బాంగ్ హూన్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయన 2019 నుంచి చాగాంగ్ ప్రావిన్స్ పాలనా వ్యవహారాలు చూస్తున్నట్లు సమాచారం. జూలైలో భారీ వర్షాల కారణంగా ఉత్తర కొరియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు సంభవించాయి. దీనివల్ల దాదాపు 4వేలకుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 15,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే అధికారుల ఉరిశిక్షలకు సంబంధించి దక్షిణ కొరియా మీడియాలో వచ్చిన వార్తలను ఉత్తర కొరియా తప్పుపట్టింది. తమ దేశంపై విషం కక్కేలా దక్షిణ కొరియా మీడియా వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ విధమైన ప్రచారాన్ని ఆపేయాలని హితవు పలికింది.