New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ
కొత్త ఆధార్ యాప్(New Aadhaar App) వల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని తిరిగే పని సైతం తప్పుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
- By Pasha Published Date - 08:28 AM, Wed - 9 April 25

New Aadhaar App: ‘ఆధార్ వెరిఫికేషన్’ అంటే ప్రస్తుతం కొంత టఫ్ ప్రక్రియ. కానీ ఇకపై అది చాలా ఈజీగా మారబోతోంది. యూపీఐ పేమెంట్ చేసినంత ఈజీగా మనం త్వరలో ఆధార్ వెరిఫికేషన్‌ను కంప్లీట్ చేయొచ్చు. అంత సౌలభ్యాన్ని మనకు అందించే సరికొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈవిషయాన్నికేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
New Aadhaar App
Face ID authentication via mobile app❌ No physical card
❌ No photocopies🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
Also Read :Tamilisai : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం
మొహాన్ని చూసి..
‘‘కొత్త ఆధార్ యాప్ వచ్చాక, మనం అందులోకి వెళ్లి డిజిటల్‌గా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఆధార్ కార్డుల యూజర్ల ప్రైవసీకి భద్రత కూడా లభిస్తుంది. ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వెరిఫికేషన్‌ను పూర్తి చేయొచ్చు’’ అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో కలిసి ఈ యాప్‌ను తయారు చేశామని ఐటీశాఖ మంత్రి చెప్పారు. ఆధార్ కార్డులో పేరున్న వ్యక్తి మొహాన్ని చూసి ఫేస్ వెరిఫికేషన్‌ను చేసే ఫీచర్ సైతం ఈ కొత్త యాప్‌లో ఉంటుందన్నారు.
బీటా టెస్టింగ్ దశలో..
కొత్త ఆధార్ యాప్(New Aadhaar App) వల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని తిరిగే పని సైతం తప్పుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతానికి ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉందని పేర్కొన్నారు. కొత్త ఆధార్ యాప్ వచ్చాక.. ప్రయాణాలు చేసే వేళ, హోటల్‌లో రూమ్స్ బుకింగ్ కోసం, షాపింగ్ వేళ మనం ఆధార్ కార్డును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన స్మార్ట్‌ఫోన్‌లోని ఈ యాప్‌ను ఓపెన్ చేసి, అందులో నుంచి ఆధార్ కార్డును సంబంధిత వ్యక్తులకు డిజిటల్‌గా షేర్ చేయొచ్చు. ఇలా షేర్ చేసే క్రమంలో ఆధార్ కార్డు యూజర్ తన అనుమతిని తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. ఆధార్ సమాచారాన్ని ఇతరులు ఫోర్జరీ చేసే అవకాశం ఉండదు.