Tamilisai : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం
తమిళిసై(Tamilisai) బీజేపీలో ఉండగా.. ఆమె తండ్రి కుమారి అనంతన్ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
- By Pasha Published Date - 08:00 AM, Wed - 9 April 25

Tamilisai : తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ తండ్రి కుమారి అనంతన్ కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామునే కుమారి అనంతన్ తుదిశ్వాస విడిచారు. ఈవిషయాన్ని తమిళిసై ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలు నివాళులు అర్పించడానికి కుమారి అనంతన్ భౌతికకాయాన్ని సాలిగ్రామంలోని ఆయన కుమార్తె ఇంట్లో ఉంచారు. కాగా, తమిళిసై తల్లి కృష్ణ కుమారి 2021 ఆగస్టులో మరణించారు. ఆమె హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
தமிழ் கற்றதனால் நான் தமிழ் பேசவில்லை… தமிழ் என்னைப் பெற்றதனால் நான் தமிழ் பேசுகிறேன் என்று…. பெருமையாக . பேச வைத்த என் தந்தை திரு.குமரி அனந்தன் அவர்கள்… இன்று என் அம்மாவோடு.. இரண்டர கலந்து விட்டார்… குமரியில்.. ஒரு கிராமத்தில் பிறந்து.. தன் முழு முயற்சியினால்…… pic.twitter.com/MxDWOHg5OJ
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) April 8, 2025
Also Read :Donald Trump: చైనాకు బిగ్ షాకిచ్చిన ట్రంప్.. ఆ దేశ వస్తువులపై 104శాతం సుంకం విధింపు
కాంగ్రెస్‌లో అగ్రనేతగా తమిళిసై తండ్రి
తమిళిసై(Tamilisai) బీజేపీలో ఉండగా.. ఆమె తండ్రి కుమారి అనంతన్ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన జీవితంలో ఎన్నడూ పార్టీ మారలేదు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. ఆయన 1977లో కాంగ్రెస్ అభ్యర్థిగా నాగర్‌కోయిల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతేకాదు ఐదుసార్లు తమిళనాడు అసెంబ్లీ సభ్యుడిగా అనంతన్ ఎన్నికయ్యారు. ఈయన తమిళంలో ప్రముఖ వక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. కుమారి అనంతన్ మరణవార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Also Read :Trump Tariff: బెడిసికొడుతున్న ట్రంప్ టారిఫ్ వార్.. బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ట్రంప్ అడ్వైజర్‌పై ఫైర్
కుమారి అనంతన్‌కు ఘన నివాళులు
కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్‌కు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పార్లమెంటులో తొలిసారి తమిళంలో మాట్లాడిన నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. తమిళ భాషా సంస్కృతుల అభివృద్ధికోసం విశేష కృషిచేశారు.తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం స్టాలిన్, తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి, వి.శశికళ, పన్నీర్ సెల్వం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, టీవీకే చీఫ్ విజయ్‌తో పాటు పలువురు సీపీఎం, సీపీఐ నేతలు తమిళి సై తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుమారి అనంతన్ మరణం తమిళ సమాజానికి పెద్ద లోటు అని సీఎం స్టాలిన్ తెలిపారు.