Vande Bharat Accident : వందేభారత్ ఢీకొని.. ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
Vande Bharat Accident : ట్రైన్ వస్తుండటంతో.. రైల్వే క్రాసింగ్ గేట్లను మూసేశారు.
- By Pasha Published Date - 11:30 AM, Mon - 30 October 23

Vande Bharat Accident : ట్రైన్ వస్తుండటంతో.. రైల్వే క్రాసింగ్ గేట్లను మూసేశారు. అయితే ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గేటును దాటి రైలు పట్టాల మీదుగా నడిచే వెళ్లే ప్రయత్నం చేసింది. ఆమె పట్టాలు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన వందేభారత్ రైలు ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ సమీపంలో ఉన్న కసంపూర్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో 40 ఏళ్ల మోనా, ఆమె ఇద్దరు పిల్లలు మనీషా(14), చారు(7) ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లలో యువత ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 29 శాతం మంది యువకులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రూపొందించడంతో.. వాటిలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, తిరుపతి – సికింద్రాబాద్, కాచిగూడ – యశ్వంతపూర్, విజయవాడ – చెన్నై సెంట్రల్ ఈ రైళ్లు సెంట్రల్ మార్గంలో ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. త్వరలో మరికొన్ని రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం (Vande Bharat Accident) ఉంది.