Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
- By Latha Suma Published Date - 01:27 PM, Tue - 29 October 24
Maharastra Assembly Elections : ఈ రోజు (మంగళవారం) తో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో, కూటములలోని అభ్యర్థుల మధ్య ఆందోళన నెలకొంది. నామినేషన్ చివరి తేదీ దగ్గర పడుతున్నప్పటికీ, ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. ఈ పరిస్థితి అభ్యర్థులకు మరియు వారి అనుచరులకు అసంతృప్తి కలిగిస్తోంది.
ఇకపోతే.. రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి ఏర్పడిన మహావికాస్ అగాఢీ కూటమి ఇప్పటి వరకు 265 అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 21 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో, కాంగ్రెస్ 102 సీట్లలో, యుద్ధవ్ శివసేన 84 సీట్లలో, శరద్ పవార్ ఎన్సీపీ 82 సీట్లలో పోటీ చేస్తోంది. కాగా, రెండు వైపుల నుంచి పూర్తి అభ్యర్థుల జాబితా విడుదల కాకపోవడం, నామినేషన్ తేదీ ముగియడంతో కూటమి పార్టీల ఆశావహుల్లో కాస్త అనిశ్చితి నెలకొంది. ఈ రోజు సాయంత్రానికి మిగిలిన సీట్లకు అభ్యర్థులను వెల్లడిస్తారేమో చూడాలి మరి.
Read Also: Rosegar Mela : యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి