Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు.
- By Latha Suma Published Date - 05:52 PM, Wed - 17 July 24

Kejriwal Bail Petition: మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ తీర్పు జూలై 29న రానుంది. ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ తమ వాదనలు వినిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసిందని.. ఆ తర్వాత కేజ్రీవాల్ లొంగిపోయారని న్యాయవాది తెలిపారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయం ఖచ్చితంగా సరైనది. కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోలేదని.. తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యారన్నారు. విచారణకు కేజ్రీవాల్ ఎప్పుడూ సహకరిస్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ ఐదుసార్లు 50కి దిగువకు చేరిందని.. ఇది ఆందోళనకు కారణం. నిద్రపోతున్నప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవడం ప్రమాదకరం. ఈ కేసులో అందరికీ బెయిల్ వస్తున్నదని.. తన పార్టీ పేరు ఆమ్ ఆద్మీ.. తనకు బెయిల్ రావడం లేదని అన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Read Also: Tamil Movies : అక్టోబర్‌ని కబ్జా చేస్తున్న తమిళ్ సినిమాలు..
ఈడీ కేసులో సుప్రీంకోర్టు సీఎం కేజ్రీవాల్‌కు ఇటివల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలులో ఉన్నారు. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే.
Read Also: Friday: శుక్రవారం రోజు ఆ ఒక్క పని చేస్తే చాలు.. డబ్బే డబ్బు!