Friday: శుక్రవారం రోజు ఆ ఒక్క పని చేస్తే చాలు.. డబ్బే డబ్బు!
శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే లక్ష్మి అనుగ్రహంతో కుటుంబ సంతోషం, శాంతి పెరిగి ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా శుక్రవారం అమ్మవారిని
- By Anshu Published Date - 05:20 PM, Wed - 17 July 24

శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే లక్ష్మి అనుగ్రహంతో కుటుంబ సంతోషం, శాంతి పెరిగి ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా శుక్రవారం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుందని పండితులు సైతం చెబుతున్నారు. అలాగే మీ సంపద కూడా పెరుగుతుందట. వీటితోపాటు శుక్రవారం రోజు ఇంకా ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం లేదా ఉపవాసం ఉండటం వల్ల మీ సంపద పెరుగుతుందట.
ఎరుపు గులాబీలను అమ్మ లక్ష్మికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. లక్ష్మీ దేవిని ఎర్ర గులాబీలతో పూజించాలి. అలాగే లక్ష్మీకీ తేనెతో ఖీర్ సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరికీ పంచి పెట్టాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తమలపాకులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం, సామరస్యం పెరిగి మనసు ఆనందంగా ఉంటుందట. అలాగే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ రోజంతా లక్ష్మి తల్లిని స్మరించాలి. యాలకులు లవంగం కర్పూరం కొవ్వొత్తి వెలిగించి లక్ష్మీ దేవికి హారతి ఇవ్వాళట. అన్ని గదుల్లోనూ ఈ ఆర్తి చూపించాలట.
ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోయి లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుందట. అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు పండితులు. ఇక సంపద పెరగాలి అనుకున్న వారు చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తిక్ చిహ్నం గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచాలి. తర్వాత దానిపై శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించి పూజ చేయాలి. పూజ.తర్వాత గోమతి చక్రాన్ని మీ పర్స్ లో ఉంచుకోవాలి. లేదంటే డబ్బుతో సురక్షితమైన స్థలంలో లేదా అల్మారాలో పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు పండితులు. ప్రతి శుక్రవారం ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మీ సంపద పెరగడంతో పాటు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయట. అదేవిధంగా శుక్రవారం కన్యలకు అన్నదానం చేయడం కూడా మంచిది అంటున్నారు పండితులు.. ఇక శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత “ఓం శ్రీ నమః ” మేమంతా అని 11 సార్లు జపించాలట. ప్రతి శుక్రవారం సాయంత్రం దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని కనీసం 11సారైనా జపించాలని చెబుతున్నారు.