Kamal Haasan: బీజేపీ వ్యతిరేక శక్తులతో కమల్ ప్రయాణం..
2024 ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్ది రాజకీయ సమీకరణాలు మారుస్తున్నాయి. అధికారపార్టీపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో పొత్తు అనే అంశం ప్రధానాంశంగా మారుతుంది.
- Author : Praveen Aluthuru
Date : 11-09-2023 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
Kamal Haasan: 2024 ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్ది రాజకీయ సమీకరణాలు మారుస్తున్నాయి. అధికారపార్టీపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో పొత్తు అనే అంశం ప్రధానాంశంగా మారుతుంది.
బీజేపీ పార్టీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాలని ప్రముఖ నటుడు, క్కల్ నీది మైయం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ తీరుని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన కోయంబత్తూర్, మదురై మరియు దక్షిణ చెన్నై ఈ మూడు లోక్‌సభ స్థానాలపై పార్టీ దృష్టి సారించినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో మరియు గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎన్‌ఎం ఈ మూడు లోక్‌సభ నియోజకవర్గాలలో ప్రభావం చూపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం ఓట్లలో 3.43 శాతం ఓట్లను ఎంఎన్‌ఎం దక్కించుకుంది. అయితే
2024 ఎన్నికల్లో కనీసం మూడు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ.. దాని ఆధారంగానే ఎన్నికల పొత్తులను ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఎంఎన్‌ఎం యువజన విభాగం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ చేపట్టిన రాజకీయ స్థితిగతులపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. మెరుగైన పాలనపై పార్టీ వైఖరికి సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో పార్టీ నాయకత్వం కూడా త్వరలో మాట్లాడనుంది. అయితే కమల్ ఏ పార్టీలతో ముందుకెళ్తారనేది రెండు మూడు రోజుల్లో స్పష్టం కానుంది.
Also Read: 14 Died: చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు, రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి