Jharkhand Floor Test: జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం కూటమి విజయం
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు
- By Praveen Aluthuru Published Date - 03:06 PM, Mon - 5 February 24
Jharkhand Floor Test: హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు వేయడంతో ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ప్రభుత్వం మెజారిటీతో గెలుపొందారు. కాగా 29 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు.
బలపరీక్షకు ముందు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. జేఎంఎం కూటమిని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించారు. నిన్న హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో రాంచీకి చేరుకున్నారు.
అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు రాయ్‌పూర్‌లోని అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రస్తుతం జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది.
Also Read: HYD : వేదింపులు తట్టుకోలేక చెన్నై షాపింగ్ మాల్ బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య..