HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Jagannath Rath Yatra Begins Grandly In Puri

Puri jagannath Rath Yatra: పూరీలో ఘ‌నంగా మొద‌లైన జ‌గ‌న్నాథ్ ర‌థ‌యాత్ర‌..

  • Author : Vamsi Chowdary Korata Date : 16-07-2026 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagannath Rath Yatra begins grandly in Puri...
Jagannath Rath Yatra begins grandly in Puri...

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.‘జై జగన్నాథ్’ నినాదాలతో పూరీ వీధులు మార్మోగాయి.

ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి, గుండిచా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో ఒడిశా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం 13,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని, కేంద్ర బలగాలను మోహరించారు. 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 473 సీసీటీవీ కెమెరాలు, 65 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే జగదల్‌పూర్, రాయగడ నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పూరీ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద రథయాత్ర గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • gundicha temple
  • Jagannath Rath Yatra
  • Lord Jagannath Rath Yatra
  • odisha
  • Puri jagannath Rath Yatra

Related News

Monday, Arudra, Masa Shivaratri... the spiritual merit equivalent to 100 Maha Shivaratris...

Masa Shivaratri: సోమవారం + ఆరుద్ర నక్షత్రం + మాస శివరాత్రి.. 100 మహాశివరాత్రి పుణ్యఫలం..

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన “మాస శివరాత్రి” మరియు ఆ స్వామి జన్మ నక్షత్రమైన “ఆరుద్ర నక్షత్రం” ఒకేరోజు కలసి రావడం అత్యంత అరుదైన, పవిత్రమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు నదులు, కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివ

    Latest News

    • Bhagyanagaramloo Saradhi Prema : ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ టాక్

    • New Zealand: న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు..

    • Ice Cream: ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.. మ‌హిళ‌లు త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

    • Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

    • KTR: చంద్రబాబు పనితీరును కొనియాడిన కేటీఆర్‌

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd