Nadda: దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపటమే మోడీ లక్ష్యం
- By Balu J Published Date - 05:39 PM, Fri - 22 September 23

Nadda: దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టితో పలు సంస్కరణలను అమలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా అన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని.. కొత్త ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరాని, మీనాక్షి లేఖి సహా పలువురు మహిళలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించారు.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ అభియాన్, జనధన్, ఉజ్వల యోజన, ట్రిపుల్ తలాఖ్ రద్దు, పీఎం ఆవాస్ యోజన వంటి పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
Also Read: TTD: కన్నుల పండువగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు