TTD: కన్నుల పండువగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.
- By Balu J Published Date - 05:32 PM, Fri - 22 September 23

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజైన నేటి ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు. మరోవైపు, విశిష్టమైన శ్రీవారి గరుడవాహనసేవ ఈ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున భక్తులు పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీనివాసుడిని 64 వేల 277 మంది దర్శించుకున్నారు.
Also Read: Epuri Somanna: షర్మిల్ కు బిగ్ షాక్, బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న!