HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Mumbai Meeting On August 31 And September 1 May Decide On Five Panels

INDIA – Social Media : సోషల్ మీడియా అస్త్రంపై ‘ఇండియా’ కసరత్తు.. త్వరలో కూటమికి కొత్త లోగో

INDIA - Social Media : సోషల్ మీడియా.. ప్రజలపై  గణనీయ ప్రభావం చూపించగల మహాస్త్రం.. ప్రజలకు ఒక ఒపీనియన్ ను క్రియేట్ చేయడంలో అది అత్యంత పవర్ ఫుల్ టూల్.. ఇప్పుడు  కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి దృష్టి సోషల్ మీడియాపై పడింది.

  • By Pasha Published Date - 07:41 AM, Sun - 27 August 23
  • daily-hunt
India Social Media
India Social Media

INDIA – Social Media : సోషల్ మీడియా.. ప్రజలపై  గణనీయ ప్రభావం చూపించగల మహాస్త్రం.. ప్రజలకు ఒక ఒపీనియన్ ను క్రియేట్ చేయడంలో అది అత్యంత పవర్ ఫుల్ టూల్.. ఇప్పుడు  కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి దృష్టి సోషల్ మీడియాపై పడింది. బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న సోషల్ మీడియాపై పట్టు అత్యవసరమని ‘ఇండియా’ కూటమి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో మహారాష్ట్రలోని ముంబై వేదికగా జరగబోయే ‘ఇండియా’ సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాల కోసం ప్రత్యేక ప్యానల్ ను ప్రకటించనున్నారని సమాచారం.  కూటమిలోని పార్టీలు వాటి కంటెంట్ ను పరస్పరం సోషల్ మీడియాలో షేర్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారని అంటున్నారు. ‘ఇండియా’ కూటమి కోసం ఉమ్మడి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికను ఏర్పాటు చేయడంపైనా ఫోకస్ పెట్టనున్నారని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.దీనిపై ఏర్పాటు చేయనున్న ప్యానల్ లోని సభ్యులు అందించే సలహాల ఆధారంగా సోషల్ మీడియా ప్రచారానికి వ్యూహ రచన చేయనున్నారు. ఇండియా కూటమి తరఫున బహిరంగ సభలు, ర్యాలీలపై ప్లానింగ్ కు ఒక ప్యానల్, ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ప్యానల్, ఇండియా కూటమికి సాంకేతిక, సామగ్రిపరమైన సహకారాన్ని అందించేందుకు ఒక  ప్యానల్ ను కూడా ప్రకటించనున్నారని తెలిసింది. ఈ కమిటీల్లో అన్ని పార్టీలకూ చోటు దక్కేలా సమతుల్యత పాటించనున్నారు.

Also read : Garlic Side Effects: వెల్లుల్లి అధికంగా వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

పేపర్ బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణకు డిమాండ్  !

ఇప్పటికే ఇండియా కూటమి పేరు దేశమంతటా మార్మోగుతోంది. ఇక త్వరలోనే ఆగస్టు 31న ఇండియా కూటమి లోగోను కూడా రిలీజ్ చేయనున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత  అశోక్ చవాన్ వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల వినియోగంపై విధాన ప్రకటన చేయడంతో పాటు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ను ఈ మీటింగ్ ద్వారా వినిపించేందుకు ఇండియా కూటమి సన్నాహాలు చేస్తోంది.  జూన్ 23న  పాట్నాలో జరిగిన ఇండియా కూటమి తొలి మీటింగ్ లో 15 పార్టీలు హాజరయ్యాయి. జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగిన రెండో సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. ఇప్పుడు ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరగనున్న మీటింగ్ కు అటెండ్ అయ్యే  ప్రతిపక్ష పార్టీల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఇండియా కూటమి కీలక సభ్యుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.

Also read : Food for Childrens : పిల్లలలో ఇమ్యూనిటీ పెంచే ఆహారపదార్థాలు ఇవే..

11 మంది సభ్యుల కోఆర్డినేషన్ కమిటీపై క్లారిటీ.. 

ఇండియా కూటమిలోని పార్టీలను సమన్వయం చేసేందుకు 11 మంది సభ్యుల కోఆర్డినేషన్ కమిటీని (INDIA – Social Media) బెంగళూరు మీటింగ్ లోనే ప్రకటించింది. ముంబైలో జరగబోయే మీటింగ్ లో  ఆ కమిటీలో ఉండే సభ్యులను ప్రకటించనున్నారు. రాష్ట్రాల స్థాయిలో అక్కడి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలనే అంశంపైనా ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరగనుంది. ముంబై సమావేశం చివర్లో ఉమ్మడి ముసాయిదా ప్రకటనను విడుదల చేయనున్నారు. తదుపరిగా ఇండియా కూటమి సమావేశాలు కోల్‌కతా, చెన్నైలలో జరగనున్నాయని కూటమి వర్గాలు చెప్పాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • five panels
  • india
  • INDIA - Social Media
  • INDIA alliance
  • Mumbai meet
  • seat sharing arrangements

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd