Food for Childrens : పిల్లలలో ఇమ్యూనిటీ పెంచే ఆహారపదార్థాలు ఇవే..
పిల్లలలో ఇమ్యూనిటీ(Immunity) ని పెంచే ఆహారపదార్థాలను ఆహారం(Food)లో భాగం చేయాలి.
- By News Desk Published Date - 10:30 PM, Sat - 26 August 23

ఇప్పుడు వాతావరణం వానలు, ఎండలు గా ఉంటుంది. కాబట్టి పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు కొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి పిల్లలలో ఇమ్యూనిటీ(Immunity) ని పెంచే ఆహారపదార్థాలను ఆహారం(Food)లో భాగం చేయాలి. పిల్లలకు బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, క్రాన్ బెర్రీస్ ఆహారంగా ఇవ్వాలి. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి. ఇవి పిల్లలలో ఇమ్యూనిటీని పెంచుతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, చియా సీడ్స్ వంటి వాటిలో ఫైబర్, పాలీ అన్ సాచురేటెడ్ కొవ్వులు, మోనో అన్ సాచురేటెడ్ కొవ్వులు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలలో ఇమ్యూనిటీ ని పెంచుతాయి. పుల్లగా ఉండే ద్రాక్ష, నారింజ, బత్తాయి, నిమ్మ, కివి, దానిమ్మ, జామకాయ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వలన ఈ పండ్లను పిల్లలు తినడం వలన ఇవి మన పిల్లల శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.
రోజూ పిల్లలకు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి ఇవ్వాలి. కోడిగుడ్డులో విటమిన్ ఎ,బి 12 ఎక్కువగా ఉంటాయి ఇది తినడం వలన కూడా పిల్లలలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కొంతమంది పిల్లలు పెరుగు తినరు కానీ రోజూ పిల్లలకు పెరుగు తినిపించాలి. ఎందుకంటే పెరుగు తినడం వలన అది పిల్లల శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. పెరుగు పిల్లలలో జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పాలల్లో పసుపు వేసి మరిగించి ఆ పాలను పిల్లల చేత తాగిస్తే పిల్లలలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ విధంగా మనం మన పిల్లలలో ఇమ్యూనిటీని పెంచితే తొందరగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
Also Read : Healthy Habits: నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలోకండి, 40లోనూ 20లా ఉండొచ్చు!