Lok Sabha : కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్
కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌ను లోక్‌సభలో డిప్యూటీ లీడర్(Lok Sabha Deputy Leader) గా ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)కు కాంగ్రెస్ పంపింది.
- By Latha Suma Published Date - 07:18 PM, Sun - 14 July 24

Gaurav Gogoi: కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌ను లోక్‌సభలో డిప్యూటీ లీడర్(Lok Sabha Deputy Leader) గా ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)కు కాంగ్రెస్ పంపింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌ను, అలాగే వీప్‌లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. సి. వేణుగోపాల్ ఆదివారం ఎక్స్ వేదికగా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక వీరి నియమాకాన్ని ఉంటంకిస్తూ.. లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సలహాలు, సూచనలతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలపై గళమెత్తుతాయని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు కేరళ నుండి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన కొడికున్నిల్ సురేష్, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా వ్యవహరిస్తారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. విరుదునగర్ ఎంపీ మాణికం ఠాగూర్, కిషన్‌గంజ్ ఎంపీ మహ్మద్ జావేద్ లోక్‌సభలో పార్టీ విప్‌లుగా వ్యవహరిస్తారని చెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు ప్రజల సమస్యలపై శక్తివంతంగా పోరాడతాయని వేణుగోపాల్ అన్నారు. ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: YCP vs TDP : టీడీపీ ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్..!
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే మహారాష్ట్రలోని సాంగ్లీ నుండి తిరుగుబాటు అభ్యర్థిగా గెలిచిన విశాల్ పాటిల్ సైతం కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. సూమారు దశాబ్దం అనంతరం ఆపార్టీ ఈ హోదాను చేజిక్కించుకుంది. ఆ క్రమంలో సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. కానీ, ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయబరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఒకదానికి రాహుల్ రాజీనామా చేయాల్సి ఉంది. దాంతో వయనాడ్‌కు ఆయన రాజీనామా చేశారు.
Read Also: Pooja Hegde : కొత్త అందాలతో మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..!