HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gas Cylinder Blast In Simla

1 Killed : సిమ్లాలోని ఓ రెస్లారెంట్‌లో పేలిన సిలిండర్‌.. ఒకరు మృతి, ప‌ది మందికి గాయాలు

సిమ్లాలోని మాల్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందగా, మ‌రో 10 మంది గాయపడ్డారు.

  • Author : Prasad Date : 19-07-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gas
Gas

సిమ్లాలోని మాల్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందగా, మ‌రో 10 మంది గాయపడ్డారు. మాల్ రోడ్‌లో అగ్నిమాపక దళం కార్యాలయం పక్కనే ఉన్న ఈటింగ్ జాయింట్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. మాల్ రోడ్‌కి దిగువన ఉన్న మిడిల్ బజార్‌లో హిమాచలీ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందిన హిమాచలీ రసోయి రెస్టారెంట్ ఉంది. అక్క‌డ వంట చేస్తుండ‌గా ఒక్క సారిగా గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. పేలుడుధాటికి ఆరు షాపులు దెబ్బతిన్నాయని వ్యాపారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న పలు దుకాణాలు, ఇళ్ల కిటికీల అద్దాలు ప‌గిలిపోయాయి. ప‌క్క‌నే ఫైర్ స్టేష‌న్ ఉండ‌టంతో హుటాహుటిన సిబ్బంది చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. పేలుడుకు 20 నిమిషాల ముందు గ్యాస్ లీక్ అయినట్లు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఒకరు మృతి చెందారు. కాలిన గాయాలైన మరో పది మందిని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఐజీఎంసిహెచ్) సిమ్లాకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సిమ్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, పేలుడుకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న బీజేపీ అధికార ప్రతినిధి కరణ్‌ నందా ఘటనపై విచారణ జరిపి దుకాణాలు దెబ్బతిన్న వారికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cylinder blast
  • Cylinder Explosion
  • india
  • simla

Related News

Celebrities And Their Plane

పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్‌లో నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెను విషాదం. ఇటీవలి కాలంలో చూస్తే, 2021లో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్

  • India- EU Free Trade Deal

    గుడ్ న్యూస్‌.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!

  • mohsin naqvi pak cricket team

    టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!

  • Donald Trump

    భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  • T20 World Cup

    టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!

Latest News

  • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

  • Budget 2026 : స్మోకింగ్ & గుట్కా ప్రియులకు షాక్

  • Nirmala Sitharaman Saree: ఈసారి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ చీర ఎంతో ప్రత్యేకం !!

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd