Sisodia : మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కాం కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.
- By Latha Suma Published Date - 03:56 PM, Mon - 15 July 24

Manish Sisodia: ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను గతేడాది మార్చిలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్, ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వాదనలను వాయిదా వేసింది. ఈ నెల 15న మళ్లీ విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ క్రమంలోనే 22 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.
సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన తర్వాత ఫిబ్రవరి 26, 2023 నుండి కస్టడీలో ఉన్నారు. అతడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ మంత్రివర్గం నుంచి సిసోడియా రాజీనామా చేశారు.
Read Also: Pawan Kalyan : వీరమల్లు కోసం పవన్ కదులుతున్నాడా..?