Election Failure: కాంగ్రెస్ ఓటమిపై రాహుల్ సీరియస్ మీటింగ్
రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో అధ్యయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
- By Praveen Aluthuru Published Date - 04:31 PM, Sat - 9 December 23

Election Failure: రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో అధ్యయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో ఓటమి తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.కాగా.ఈరోజు శనివారం రాజస్థాన్, మిజోరాం ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, తాత్కాలిక ముఖ్యమంత్రి అశోక్ ఖేలత్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు, ఓటమికి గల కారణాలపై చర్చించారు.అంతకుముందు నిన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల వైఫల్యంపై సమావేశం జరిగింది.
Also Read: CM Jagan : కొత్త మోసానికి తెరలేపిన సీఎం జగన్ – గంటా శ్రీనివాస్