Who is DGMO: నేరుగా పాక్‌తో భారత డీజీఎంఓ చర్చలు.. డీజీఎంఓ పవర్స్, బాధ్యతలేంటి ?
డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ప్రతీ దేశ సైన్యంలో ఒక డీజీఎంఓ(Who is DGMO) స్థాయి అత్యున్నత పోస్టు ఉంది.
- By Pasha Published Date - 12:05 PM, Sun - 11 May 25

Who is DGMO: మే 7న వేకువ జామున భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఆ తర్వాతి నుంచి శనివారం రోజు (మే 10) మధ్యాహ్నం వరకు భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగింది. భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు దిగింది. భారత సేనలు ఈ దాడులను తిప్పికొట్టాయి. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలు, ఇతరత్రా మిలిటరీ బేస్‌లు, ఎయిర్ లాంచ్ ప్యాడ్‌లను భారత సేనలు ధ్వంసం చేశాయి. యుద్ధం ఇంకా కొనసాగుతుందని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్‌కు పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా కాల్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తరఫున కాల్పుల విరమణ ప్రతిపాదన పెట్టారు. భారత త్రివిధ దళాలు, కేంద్ర ప్రభుత్వంతో దీనిపై మాట్లాడిన భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్..ఆ తర్వాత దీనిపై పాకిస్తాన్ డీజీఎంఓకు కీలక సమాచారం ఇచ్చారు. కొన్ని షరతులతో సీజ్ ఫైర్ ప్రతిపాదనకు భారత్ తరఫున అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ డీజీఎంఓ పోస్టులో ఉన్నవారు ఏయే పనులు చేస్తారు ? యుద్ధాన్ని ఆపేంత పవర్స్ వారికి ఉంటాయా ? శాలరీ ఎంత ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Kashmir Offer : భారత్, పాక్‌లకు ట్రంప్ ‘‘కశ్మీర్ ఆఫర్’’.. ఏమిటది ?
డీజీఎంఓ పవర్స్.. సౌకర్యాలు.. శాలరీ
డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ప్రతీ దేశ సైన్యంలో ఒక డీజీఎంఓ(Who is DGMO) స్థాయి అత్యున్నత పోస్టు ఉంది. ఇది చాలా పెద్ద పదవి. ప్రస్తుతం భారత డీజీఎంఓగా రాజీవ్ ఘయ్ ఉన్నారు. ఈయన 2024 అక్టోబరులోనే ఆ పదవిని చేపట్టారు. భారత్‌లో డీజీఎంఓ పదవిలో ఉన్నవారికి ప్రతినెలా రూ.2.25 లక్షల దాకా శాలరీ లభిస్తుంది. ఈ పదవిలో ఉండేవారికి ప్రభుత్వ క్వార్టర్స్, వాహనం, భద్రతలను కేటాయిస్తారు. ఇతరత్రా భత్యాలు, పారితోషికాలు కూడా ఇస్తారు.పాకిస్తాన్ డీజీఎంఓగా కాశిఫ్ అబ్దుల్లా ఉన్నారు. సైన్యంలోని వివిధ విభాగాల్లో కీలక హోదాల్లో సేవలు అందించిన వారికి డీజీఎంఓగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ అవకాశం అతికొద్ది మందికే లభిస్తుంది. డీజీఎంఓ పోస్టు ఒకటే ఉంటుంది. ఒక దేశ డీజీఎంఓకు మరో దేశ డీజీఎంఓతో నేరుగా ఫోన్ లైన్‌లో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఈమేరకు వారికి ప్రత్యేక ఫోన్ లైన్ ఏర్పాట్లు ఉంటాయి. అయితే డీజీఎంఓగా ఉన్నవారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS), భారత రక్షణశాఖ మంత్రికి జవాబుదారీగా ఉంటారు. తాను జరిపే చర్చల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ రెండు విభాగాలకు తెలియజేస్తారు. వారితో కలిసి సంయుక్తంగా తుది నిర్ణయాన్ని తీసుకుంటారు.
Also Read :Pawan Kalyan: మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తూ పవన్ ఎమోషనల్
డీజీఎంఓ ఏమేం చేస్తారో తెలుసా ?
- మొత్తం సైన్యం సైనిక కార్యకలాపాలు, యుద్ధ వ్యూహాలు, ఇతర సైనిక కార్యకలాపాలకు డీజీఎంఓ బాధ్యత వహిస్తారు.
- సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, యుద్ధం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు డీజీఎంఓ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలతో దేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడతారు.
- దేశ సైనిక, దౌత్య ప్రయత్నాల మధ్య సరైన సమన్వయం ఉండేలా డీజీఎంఓ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేయిస్తారు.
- శత్రుదేశం లక్ష్యంగా మిలిటరీ ఆపరేషన్ల కోసం ప్లానింగ్ తయారీలో డీజీఎంఓ కీలక పాత్ర పోషిస్తారు. ఈక్రమంలో భారత త్రివిధ దళాలు, నిఘా/గూఢచార విభాగాలు, భద్రతా సంస్థలను సమన్వయం చేస్తారు.
- పాకిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ప్రతివారం ఒకసారి ఆ దేశ డీజీఎంతో భారత డీజీఎంఓ చర్చలు జరుపుతుంటారు.