V K Saxena: గవర్నర్‌కు అతిశీ రాజీనామా లేఖ.. సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్
V K Saxena: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. గవర్నర్ వీకే సక్సేనా రాజీనామాను స్వీకరిస్తూ, AAP పరాజయానికి యమునా నది శాపమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయంపై కేజ్రీవాల్‌ను హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
- By Kavya Krishna Published Date - 11:29 AM, Mon - 10 February 25

V K Saxena:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అతిశీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఢిల్లీ రాజ్ భవన్‌కు వెళ్లిన అతిశీ, గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అధికారికంగా అందజేశారు. అయితే ఈ సందర్భంగా జరిగిన భేటీలో గవర్నర్ సక్సేనా చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ సమావేశంలో గవర్నర్ సక్సేనా మాట్లాడుతూ, “ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణం యమునా నది శాపమే” అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఇదే విషయాన్ని గతంలో సీఎం కేజ్రీవాల్‌కు కూడా తాను హెచ్చరించానని, అయితే, ఆయన తన మాటలను పట్టించుకోలేదని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అతిశీ ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం గమనార్హం. రాజ్ భవన్ వర్గాల కథనం ప్రకారం, ఈ వ్యాఖ్యలు జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ, మీడియా ముందుకు వచ్చి స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు.
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సీబీఐ అదుపులో నలుగురు!
యమునా నది కాలుష్యం – అసలు విషయం ఏమిటి?
ఢిల్లీ ప్రజలకు తాగునీటిని అందించే యమునా నది కాలుష్యం గడిచిన కొన్నేళ్లుగా తీవ్ర సమస్యగా మారిన విషయం తెలిసిందే. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) ఈ విషయంపై పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తూ, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, సంబంధిత అధికార సంస్థలకు సూచనలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, యమునా నదిలో కాలుష్యం తగ్గించేందుకు, దానిని పునరుద్ధరించేందుకు 2023లో గవర్నర్ నేతృత్వంలో ఓ హై లెవల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యమునా నది కాలుష్యానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు, పరిష్కార మార్గాలను సిఫారసు చేయాల్సిన బాధ్యత వహించింది.
ఈ కమిటీ ఏర్పాటుపై అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలుత సానుకూలంగా స్పందించారు. కమిటీకి తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. అయితే, కొద్ది రోజులకే ఢిల్లీ సర్కారు తమ వైఖరిని మార్చుకుని, ఈ కమిటీ ఏర్పాటును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఆప్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం – వివాదాస్పద పరిణామం
ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ, “గవర్నర్ ఆధ్వర్యంలోని కమిటీ సరైనది కాదు. ఈ కమిటీకి సంబంధిత రంగానికి చెందిన నిపుణుడు నాయకత్వం వహిస్తే బాగుంటుంది” అని వాదించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ఎన్జీటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీపై స్టే విధించింది. ఇదివరకు అనుకున్న విధంగా యమునా నది పునరుద్ధరణ ప్రణాళిక ఆగిపోయింది. దీంతో నది కాలుష్యం మరింత పెరిగి, సమస్య ఇంకా తీవ్రతరం అయింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉండడంతో, గవర్నర్ వీకే సక్సేనా , ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల వల్లే ఆప్ సర్కారుకు యమునా నది శాపంగా మారిందని గవర్నర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Upcoming Movies List : వాలెంటైన్స్ డే వేళ థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే