Upcoming Movies List : వాలెంటైన్స్ డే వేళ థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సినిమాల లిస్టులో(Upcoming Movies List) 3 మూవీస్ ఉన్నాయి.
- Author : Pasha
Date : 10-02-2025 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
Upcoming Movies List : ఈవారంలో సినిమా థియేటర్లు, ఓటీటీలలోకి పలు సినిమాలు విచ్చేయనున్నారు. వాలెంటైన్స్ వీక్ వేళ సినీ ప్రియులను ఆయా సినిమాలు సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ మూవీస్ ఏవి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Weekly Horoscope: వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రాశిఫలాలు
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సినిమాల లిస్టులో(Upcoming Movies List) 3 మూవీస్ ఉన్నాయి. ఫిబ్రవరి 10న బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్) రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 11న కాదలిక్క నేరమిల్లై (తమిళ్) మూవీ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 14న ధూమ్ ధామ్ (హిందీ) రిలీజ్ అవుతుంది.
ఈవారం సోనీ లివ్‌లో..
ఈవారం ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఫిబ్రవరి 14న మార్కో (తెలుగు) సినిమా విడుదల అవుతుంది.
ఈవారం డిస్నీ+హాట్‌స్టార్‌లో..
ఈవారం ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 11న బాబీ రిషి లవ్‌స్టోరీ (హిందీ) సినిమా రిలీజ్ అవుతుంది.
ఈవారం జీ5లో..
ఈవారం ఓటీటీ సంస్థ జీ5లో ఫిబ్రవరి 14న ప్యార్ టెస్టింగ్ (హిందీ) సినిమా విడుదల అవుతుంది.
ఈవారం ఆహాలో..
ఈవారం ఓటీటీ సంస్థ ఆహాలో డ్యాన్స్ ఐకాన్2 (డ్యాన్స్ షో) ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది.
Also Read :Made In Hyderabad : మేడిన్ హైదరాబాద్ యుద్ధ విమానం.. నేడే ‘ఏరో ఇండియా’లో ప్రదర్శన
ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
- ఫిబ్రవరి 14న ‘లైలా’ మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో విశ్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో నటించారు . ఆకాంక్ష శర్మ కథానాయిక.
- ఫిబ్రవరి 14న ‘బ్రహ్మా ఆనందం’ మూవీ విడుదల అవుతుంది. ఇందులో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత-మనవళ్లుగా నటించారు.
- ఫిబ్రవరి 14న ‘ఛావా’ సినిమా విడుదల అవుతుంది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు.
- ఫిబ్రవరి 14న ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ హీరో. ఈ మూవీ రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కింది.
- ఫిబ్రవరి 14న ‘తల’ మూవీ విడుదల అవుతుంది. అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్‌ను హీరోగా పరిచయం చేశారు.