CM Atishi : ఏడ్చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యల ఎఫెక్ట్
ఈ దేశ రాజకీయాలు ఇంత దారుణ స్థాయికి పతనం అవుతాయని నేను ఎన్నడూ అనుకోలేదు’’ అని అతిషి(CM Atishi) ఆవేదన వ్యక్తం చేశారు.
- By Pasha Published Date - 05:05 PM, Mon - 6 January 25

CM Atishi : ఢిల్లీ సీఎం, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ఎమోషనల్ అయ్యారు. మీడియా సమావేశంలో విలేకరుల ఎదుటే ఆమె ఏడ్చేశారు. ఇటీవలే బీజేపీ నేత రమేశ్ బిధూరి తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అతిషి ఉద్వేగానికి గురయ్యారు. ‘‘నేను రమేశ్ బిధూరికి ఒక విషయాన్ని చెప్పదలిచాను. అదేమిటంటే.. మా నాన్న ఒక టీచర్. ఆయన జీవితాంతం ఉపాధ్యాయుడిగానే ఉన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎంతోమందికి మా నాన్న చదువు చెప్పారు. మా నాన్నకు ఇప్పుడు వయసు 80 ఏళ్లు’’ అని అతిషి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
Also Read :Highest Railway Platforms : ‘చర్లపల్లి’లో 9 ప్లాట్‌ఫామ్‌లు.. అత్యధిక ప్లాట్‌ఫామ్స్ ఉన్న రైల్వేస్టేషన్లు ఇవే
‘‘ఇప్పుడు మా నాన్న నిజంగానే అనారోగ్యంతో ఉన్నారు. ఇతరుల సాయం లేకుండా ఆయన కనీసం నడవలేరు. రమేశ్ బిధూరి.. నువ్వు కేవలం ఎన్నికల కోసం ఎంతటి నీచానికి దిగజారావు ? కనీసం వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా మా నాన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా ? ఈ దేశ రాజకీయాలు ఇంత దారుణ స్థాయికి పతనం అవుతాయని నేను ఎన్నడూ అనుకోలేదు’’ అని అతిషి(CM Atishi) ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read :Mohan Babu : జర్నలిస్ట్‌పై దాడి కేసు.. సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు షాక్
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రమేశ్ బిధూరి మాట్లాడుతూ.. ‘‘సీఎం అతిషి ఆమె ఇంటి పేరును మర్లేనా నుంచి సింగ్‌కు మార్చుకున్నారు’’ అని కామెంట్ చేశారు. ‘‘ఇంతకుముందు అతిషి ఇంటిపేరు మర్లేనా.. ఇప్పుడు ఆమె ఇంటి పేరు సింగ్. కాంగ్రెస్ అవినీతిమయ పార్టీ అని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆ పార్టీతో ఇక కలిసేది లేదని ప్రజలకు హామీ ఇచ్చేందుకు కన్నపిల్లలపై ప్రమాణం చేసేందుకు కేజ్రీవాల్ రెడీ అవుతారు. మర్లేనా ఏకంగా తండ్రులనే మార్చేశారు. వాళ్ల క్యారెక్టర్ ఇది’’ అని రమేశ్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.