Mohan Babu : జర్నలిస్ట్‌పై దాడి కేసు.. సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు షాక్
మోహన్ బాబు(Mohan Babu) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇవాళే విచారించాలని కోరారు.
- Author : Pasha
Date : 06-01-2025 - 2:21 IST
Published By : Hashtagu Telugu Desk
Mohan Babu : ఇటీవలే జర్నలిస్టుపై ఎటాక్ చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం సినీ నటుడు మోహన్‌బాబు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీన్ని న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని పాస్ ఓవర్ కోరారు. అందుకు సుప్రీంకోర్టు బెంచ్ నో చెప్పింది.
Also Read :Journalist Murder Case : జర్నలిస్ట్ ముకేశ్ దారుణ హత్య.. కీలక సూత్రధారి హైదరాబాద్‌లో అరెస్ట్
దీంతో వెంటనే ముకుల్ రోహత్గీ కోర్టుకు చేరుకున్నారు. మోహన్ బాబు(Mohan Babu) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇవాళే విచారించాలని కోరారు. ఈ రిక్వెస్టుకు ధర్మాసనం నో చెప్పింది. పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Also Read :Dil Raju : ‘వకీల్ సాబ్’ను పవన్ కల్యాణ్ గుర్తు చేయగానే కన్నీళ్లు వచ్చాయి : దిల్ రాజు
ఈ కేసు విషయానికి వస్తే.. ఇటీవలే నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగింది. అవి ఆస్తి తగాదాలే అని తెలిసింది. దీంతో మోహన్ బాబుతో మాట్లాడి అసలు విషయాన్ని తెలుసుకునేందుకు పలువురు మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆ టైంలో కోపానికి గురైన మోహన్ బాబు స్వీయ నియంత్రణను కోల్పోయారు. జర్నలిస్టు రంజిత్ చేతిలో ఉన్న మైక్‌ను లాక్కొని.. దానితోనే రంజిత్ తలపై దాడి చేశారు. ఇదంతా వీడియోలలో స్పష్టంగా రికార్డు అయింది. రంజిత్ ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. ఈ కేసులో డిసెంబర్ 24న పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను మోహన్ బాబు ధిక్కరించారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఈనేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.