MP Dheeraj Prasad Sahu: ధీరజ్ ప్రసాద్ సాహు 351 కోట్లు తిరిగి ఇస్తారా?
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు స్థలాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపి 351 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన నగదు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులంతా ఉలిక్కిపడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 05:49 PM, Tue - 12 December 23

MP Dheeraj Prasad Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు స్థలాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపి 351 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన నగదు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ చూసినా 500, 200 రూపాయల నోట్లు ఉన్నాయి. దాదాపు ఐదు రోజులుగా 50 మంది బ్యాంకు అధికారులు ఐదు కౌంటింగ్ మిషన్ల సాయంతో డబ్బులు లెక్కిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ మొత్తం లెక్కింపు పూర్తయింది. మొత్తం విలువ 353.5 కోట్లకు చేరుకుంది.బలంగీర్ జిల్లాలో అత్యధికంగా 305 కోట్లు దొరికాయి. 37.5 కోట్లు, సంబల్‌పూర్‌లో 11 కోట్లు, తిట్లాగడ్‌లో 11 కోట్లు దొరికాయి.
176 బ్యాగుల్లో 140 బ్యాగ్‌లను టీమ్ లెక్కించిందని, ఇంకా 36 మిగిలి ఉన్నాయని ఎస్‌బీఐ లోకల్ మేనేజర్ భగత్ బెహ్రా తెలిపారు.కౌంటింగ్ ప్రక్రియలో 3 బ్యాంకుల అధికారులు, మా 50 మంది అధికారులు పాల్గొన్నారు. దాదాపు 40 కౌంటింగ్ యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. 25 యంత్రాలను ఉపయోగించారు. మరియు 15 వాటిని బ్యాకప్‌గా ఉంచారుని ఆయన తెలియజేశారు. పట్టుబడిన మొత్తం నల్లధనమేనని అధికారులు తెలిపారు.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం నల్ల ధనంపై పన్నుతో పాటు జరిమానా విధించే నిబంధన ఉంది. పన్ను నిర్మాణాన్ని బట్టి 300 శాతం పన్ను మరియు జరిమానా విధించబడవచ్చు. ధీరజ్ సాహు తన సంపదను తిరిగి పొందడం కష్టమని తెలుస్తుంది. దీనికి అదనంగా అతను మరింత సొమ్ము కట్టాల్సి ఉందని అంటున్నారు అధికారులు. ప్రకటించని ఆస్తుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ అదనంగా 33 శాతం పన్ను విధించవచ్చు, అందులో 3 శాతం సర్‌చార్జి ఉంటుంది. దీని తర్వాత 200 శాతం జరిమానా విధించవచ్చు. నిబంధనల ప్రకారం జప్తు చేసిన ఆస్తిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంపాదించినట్లయితే దానిపై మొత్తం 84 శాతం పన్ను మరియు జరిమానా విధించబడుతుంది.
Also Read: Lakshmi Devi : లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలు అదృష్టం పట్టిపీడించడం ఖాయం?