Lakshmi Devi : లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలు అదృష్టం పట్టిపీడించడం ఖాయం?
లక్ష్మీదేవిని (Goddess Lakshmi) ఏ విధంగా పూజిస్తే ఎటువంటి నియమాలు పాటిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
- By Naresh Kumar Published Date - 05:40 PM, Tue - 12 December 23

Worshiping Goddess Lakshmi : మామూలుగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బాగా కష్టపడి పైకి ఎదగాలని ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి (Goddess Lakshmi) అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల విధివిధానాలను పాటించాలి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. కొన్ని రకాల నియమాలను పాటించాలి. మరి లక్ష్మీదేవిని (Goddess Lakshmi) ఏ విధంగా పూజిస్తే ఎటువంటి నియమాలు పాటిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
We’re Now on WhatsApp. Click to Join.
లక్ష్మీదేవి (Goddess Lakshmi) అనుగ్రహం పొందేందుకుగాను అత్యంత నిష్టతో స్పటిక మాల ధరించాలి. స్పటిక మాల ధరించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే అమ్మ వారి అనుగ్రహం అత్యంత త్వరగా లభిస్తుందట. ఈ స్పటిక మాల ప్రకాశవంతంగా ఉంటుంది. వైట్ కలర్‌లో ఉండే ఈ మాల అంటే అమ్మవారికి ఇష్టం. పర్వతాలపై ఉండే మంచు స్పటికల రూపంలో కిందకు పడుతుంటుంది. సిలికాన్, ఆక్జిన్ పరమాణువుల మిశ్రమమే స్పటిక. కాగా ఈ స్పటిక మాల ధరించి పూజలు చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. శుక్రుడి గ్రహ స్థితి మారి మీకు మేలు జరుగుతుంది.
అలాగే లక్ష్మీదేవి కటాక్షం, అనుగ్రహం మీకు లభిస్తాయి. ఈ మాలతో జపాలు చేయడం వలన మీ ఇంటిలోని విభేదాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దంపతుల మధ్య ఉండే మనస్పర్థలు తొలగిపోయి వారు అన్యోన్యంగా ఉంటారు.. స్పటిక మాల ధరించి శుక్రుని మంత్రాలు జపించడం వలన మీకు చాలా మేలు జరుగుతుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. స్పటిక మాలతో సరస్వతీ, లక్ష్మీ దేవీ మంత్రాలను జపించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. మీ ఇంటిలోని పూజా గదిలోని లక్ష్మిదేవికి స్పటికాల దండను సమర్పించినట్లయితే మీకు అమ్మ వారి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు లైఫ్‌లో మనీకి ఎటువంటి ఇబ్బంది కాని లోటు కాని ఉండబోదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు తామర పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆమె అనుగ్రహం మరింత తొందరగా లభిస్తుంది.
Also Read: Heel Pain: చీలమండ నొప్పి తగ్గాలంటే.. మీరు ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయాల్సిందే..!