Rajasthan Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 06:06 PM, Thu - 6 July 23

Rajasthan Elections: ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాజస్థాన్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించడమే కాకుండా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాల్ని ఎలా తగ్గించాలనే అంశంపై కూడా చర్చించారు.
త్వరలో జరగనున్న రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సమావేశం జరిగినట్లు కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఐక్యంగా పోరాడుతుందన్నారు. రాజస్థాన్‌లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ సమవేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ రంధావా, సచిన్ పైలట్, రాజస్థాన్‌కు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read More: Sana Khan : పండంటి బాబుకి జన్మనిచ్చిన నటి..