Sana Khan : పండంటి బాబుకి జన్మనిచ్చిన నటి..
తాజాగా సనాఖాన్ ఓ బాబుకి జన్మనిచ్చినట్టు, తాను తల్లి అయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
- Author : News Desk
Date : 06-07-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగులో కళ్యాణ్ రామ్(Kalyan Ram) కత్తి, mr నూకయ్య, గగనం(Gaganam) సినిమాలతో మెప్పించింది హీరోయిన్ సనాఖాన్(Sana Khan). తెలుగులోనే కాక తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అనేక సినిమాలు చేసింది సనాఖాన్. 2019 వరకు సినిమాలు, పలు టీవీ షోలు చేసిన సనాఖాన్ 2020లో అనాస్ సయ్యద్ అనే ఓ వ్యాపారవేత్తని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
తాజాగా సనాఖాన్ ఓ బాబుకి జన్మనిచ్చినట్టు, తాను తల్లి అయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త, తను, తన బాబు చేతులు ఉన్న ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు సనాఖాన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సనాఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్‌లు చేస్తూ ఓ NGOని నడిపిస్తుంది.
Samantha-Vijay: విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాలు, వీడియో వైరల్