Congress AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు
- By Latha Suma Published Date - 01:44 PM, Sat - 24 February 24

Congress AAP Seat Sharing : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్లో భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. మిగిలిన 24 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని వివరించారు. హరియాణాలో ఆప్ కురుక్షేత్ర స్థానం నుంచి పోటీ చేస్తుందని తెలిపారు. ఇక చంఢీగఢ్‌లో ఉన్న ఏకైక సీటులో కాంగ్రెస్ పోటీ చేయనుందని వెల్లడించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పోటీ చేసే స్థానాలు :
రాష్ట్రం (మొత్తం సీట్లు) కాంగ్రెస్ ఆప్
ఢిల్లీ (7) 3 4 –
హరియాణా(10) 9 1
గుజరాత్ (26) 24 2
చంఢీగఢ్ (1) 1 –
గోవా (2) 2 –
We’re now on WhatsApp. Click to Join.
అయితే పంజాబ్(Punjab)లో మాత్రం కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. పరస్పర అంగీకారంతోనే పంజాబ్‌లో వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కూటమి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోరాడుతుంది. పొత్తుల వల్ల బీజేపీ(bjp) లెక్కలు తప్పుతాయి’ అని పాఠక్ అన్నారు.
read also: Viral : ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందేస్తూ చిందేసిన ప్రయాణికులు..