Bulldozer Action: మధ్యప్రదేశ్‌లో మరోసారి రెచ్చిపోయిన బుల్డోజర్లు
మధ్యప్రదేశ్‌లో మరోసారి బుల్డోజర్లు (Bulldozer Action) రెచ్చిపోయాయి. కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ బుల్డోజర్ చర్య జరిగింది.
- Author : Gopichand
Date : 15-12-2023 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
Bulldozer Action: మధ్యప్రదేశ్‌లో మరోసారి బుల్డోజర్లు (Bulldozer Action) రెచ్చిపోయాయి. కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ బుల్డోజర్ చర్య జరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తపై దాడి చేసి చేయి నరికిన నిందితులపై చర్యలు తీసుకుంటూ అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ నిందితులపై కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. వారు దోషులుగా నిరూపించబడలేదు. ఇంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ‘బుల్డోజర్ సంస్కృతి’ కొనసాగేది. కొన్ని కేసులలో నిందితులపై ఇలాంటి చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటన డిసెంబర్ 5న హబీబ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తపై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఫరూక్, అతని సోదరులు షారుక్, సమీర్, మరో ఇద్దరు సహచరులు అస్లాం, బిలాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Also Read: Whats Today : ‘యశోదా’ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. సంగారెడ్డిలో బాలయ్య పర్యటన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో బీజేపీ కార్యకర్త దేవేంద్ర ఠాకూర్‌పై వ్యక్తులు దాడి చేశారు. నిందితుల్లో ఒకరు దేవేంద్ర చేయి పట్టుకోగా, మరొకరు కత్తి తీసి నరికారు. స్వప్నిల్ అనే స్థానికుడు దేవేంద్రను రక్షించేందుకు ప్రయత్నించగా, నిందితులు అతన్ని కొట్టి పారిపోయారు. పోలీసు బృందం హబీబ్‌గంజ్‌లోని జనతా కాలనీ, సాయిబాబా నగర్‌లకు వెళ్లి నిందితుల మూడు ఇళ్లలోని అక్రమ భాగాలను కూల్చివేసిందని హబీబ్‌గంజ్ ఎస్‌హెచ్‌ఓ మనీష్‌రాజ్ భదౌరియా తెలిపారు. నిందితుడు ఫరూక్ (22) రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. అతనిపై హత్య, హత్యాయత్నం వంటి అభియోగాలతో పాటు ఇప్పటికే 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.