Whats Today : ‘యశోదా’ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. సంగారెడ్డిలో బాలయ్య పర్యటన
Whats Today : ఇవాళ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారు.
- Author : Pasha
Date : 15-12-2023 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
Whats Today : ఇవాళ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ ఉదయం 9.30 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరిస్తారు.
- ఈరోజు సంగారెడ్డి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ పర్యటిస్తారు. పటాన్‌చెరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు.
- తాడికొండ ఎమ్మెల్యే (వైసీపీ) ఉండవల్లి శ్రీదేవి ఇవాళ టీడీపీలో చేరనున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
- ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో ఏపీ కేబినెట్ సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతుంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్ పెంపు సహా పలు కీలక అంశాలపై ఈసందర్భంగా చర్చిస్తారు.
- ఇవాళ భద్రాద్రిలో ముక్కోటి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. వీటిలో భాగంగా నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వరాహవతారంలో భక్తులకు(Whats Today) దర్శనమివ్వనున్నారు.