Patna Railway Station: పాట్నా రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
అత్యంత రద్దీగా ఉండే పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో సోమవారం సాయంత్రం బాంబు పుకారు రావడంతో కలకలం రేగింది. 112కి ఫోన్ చేసి పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో మూడు బాంబులు అమర్చినట్లు ఓ వ్యక్తి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
- By Gopichand Published Date - 08:45 AM, Tue - 20 December 22

అత్యంత రద్దీగా ఉండే పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో సోమవారం సాయంత్రం బాంబు పుకారు రావడంతో కలకలం రేగింది. 112కి ఫోన్ చేసి పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో మూడు బాంబులు అమర్చినట్లు ఓ వ్యక్తి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసు బృందం సోదాలు, విచారణలో నిమగ్నమైంది. డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించి సోదాలు చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిపినా ఫలితం లేకపోయింది. జంక్షన్ వద్ద రైళ్ల లోపల కూడా తనిఖీలు చేశారు. బీహార్‌లోని అన్ని ముఖ్యమైన స్టేషన్లలో రైల్ డీఐజీ విచారణ ప్రారంభించారు. అన్ని విధాల తనిఖీలు ఆధారంగా రైల్వే యంత్రాంగం బాంబు విషయాన్ని పుకారుగా పేర్కొంది.
స్టేషన్‌కు వచ్చే రైళ్లను కూడా పరిశీలించారు. పాట్నా జంక్షన్ వైపు మహావీర్ మందిర్ చుట్టూ ఉన్న సీసీటీవీలను కూడా పరిశీలించారు. మరోవైపు కర్బిగహియా స్టేషన్ వైపు కూడా పోలీసు బృందం వసోదాలు నిర్వహించింది . పాట్నా జంక్షన్, రాజేంద్ర నగర్, పాట్నా సాహిబ్, దానాపూర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో దర్యాప్తు చేసిన తరువాత పోలీసు యంత్రాంగం బాంబు సమాచారాన్ని పుకారుగా పేర్కొంది.
112 నంబర్‌కు కాల్ రావడంతో పోలీసులు రైల్వే శాఖని కూడా అప్రమత్తం చేసి తమ బృందాన్ని అలెర్ట్ చేసింది. దీనితో పాటు కాల్ చేసిన వ్యక్తిని విచారించే పనిలో నిమగ్నమై ఉంది. పోలీసు బృందం కాల్ చేసిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకుంది. కాల్ చేసిన వ్యక్తిని అమిత్‌గా గుర్తించారు. అమిత్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని బంధువులు పోలీసులకు తెలిపారు. అతని చికిత్సకు సంబంధించిన పత్రాలతో పాటు బంధువులు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.