BJP Leader Murder: బీహార్‌లో బీజేపీ నేత హత్య.!
బీహార్ కతిహార్ ప్రాంతంలో ఘోరం జరిగింది.
- Author : Gopichand
Date : 07-11-2022 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
బీహార్ కతిహార్ ప్రాంతంలో ఘోరం జరిగింది. స్థానిక బీజేపీ నేత సంజీవ్ మిశ్రాపై అతడి ఇంటి దగ్గరే కాల్పులు జరిపారు. రెండు బైకులపై వచ్చిన దుండగులు కక్ష సాధింపు చర్యగా దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు రోడ్డు బ్లాక్ చేసిన భారీగా నిరసన తెలుపుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్ం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. కాల్చి చంపబడిన బిజెపి నాయకుడు కతిహార్ మాజీ జిల్లా కౌన్సిలర్. టెల్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెల్టా హైస్కూల్ సమీపంలోని బీజేపీ నాయకుడి ఇంటి ముందు హంతకులు ఈ ఘటనకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఆయుధాలతో బైక్‌పై వచ్చిన దుండగులు సంజీవ్ మిశ్రాపై కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో బీజేపీ నేత మృతి చెందాడు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన తర్వాత రక్తమోడుతున్న స్థితిలో ఉన్న బీజేపీ నేతను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీజేపీ హత్య వెనుక పాత కక్షలు ఉన్నట్లు సమాచారం. దీంతో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కాల్పుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.