Parliament : పార్లమెంట్ ఎంట్రన్స్‌లో కాంగ్రెస్ – బిజెపిల ఎంపీల తోపులాట
Parliament : పార్లమెంట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు
- By Sudheer Published Date - 01:42 PM, Thu - 19 December 24

గురువారం పార్లమెంట్ (Parliament ) వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్, బిజెపి ఎంపీల (BJP, INDIA bloc protest) మధ్య స్వల్ప తోపులాట జరగడంతో బిజెపి ఎంపీకి గాయాలు అయ్యాయి. గాయపడిన ఎంపీని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బిజెపి నేతలు రాహుల్ గాంధీ (Rahul) కారణంగా ఈ గాయాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బిజెపి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపిస్తూ అధికారపక్షం ఎంపీలు కూడా నిరసన తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఎంపీల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ సమయంలో బిజెపి ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడడంతో ఆయనకు స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను హాస్పటల్ కు తరలించారు. అయితే సారంగి ఆరోపణలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు.
ప్రస్తుతం సారంగి, ముకేష్‌లను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహన్తో పాటు టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటె బీజేపీ ఎంపీలు తనను తోసేసినట్లు మల్లికార్జున ఖర్గే లోక్‌సభ స్పీకర్‌కు తెలిపారు. బీజేపీ ఎంపీలు నెట్టడం వల్లే బ్యాలెన్స్ తప్పి మకర ద్వారం వద్ద కింద పడిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దురుసుగా ప్రవర్తించారని, ఆయనను పార్లమెంట్‌లోకి రాకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితమే ఎంపీల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోవద్దని స్పీకర్ చెప్పారని, అయినా బీజేపీ వాళ్లు రాహుల్‌ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు చెప్పుకొచ్చారు.
Read Also : Upendra UI : ఉపేంద్ర ‘యూఐ’ పై భారీ అంచనాలు