Upendra UI : ఉపేంద్ర ‘యూఐ’ పై భారీ అంచనాలు
Upendra UI : ‘కన్యాదానం’, ‘రా’, ‘ఎ’, ‘ఉపేంద్ర’, ‘రక్త కన్నీరు’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించాయి. ఆయన ఏ కథ అయినా వెరిటి స్టైల్‌లో చేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను అందించాడు.
- By Sudheer Published Date - 01:06 PM, Thu - 19 December 24

భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా సుదీర్ఘకాలంగా గుర్తింపు పొందిన ఉపేంద్ర (Upendra) నటిస్తున్న తాజా మూవీ ‘యూఐ’(UI). ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 90లలో ఆయన సినిమాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘కన్యాదానం’, ‘రా’, ‘ఎ’, ‘ఉపేంద్ర’, ‘రక్త కన్నీరు’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించాయి. ఆయన ఏ కథ అయినా వెరిటి స్టైల్‌లో చేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను అందించాడు.
కొన్నేళ్లుగా దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి హీరోగా మాత్రమే సినిమాలు చేసిన ఉపేంద్ర, ఇప్పుడు ‘యూఐ’ అనే స్వీయ దర్శకత్వ చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర ఈ మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని తెలిపి మరింత ఆసక్తి నింపారు. ఈ సినిమా కన్నడ భాషలో డబ్బింగ్ మూవీగా వస్తున్నప్పటికీ, టాలీవుడ్‌లో ఉపేంద్రకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ సినిమా బుకింగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా పై ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : AP High Court: ఏపీలో వాహనదారులకు షాక్.. ఇకపై ఆ వాహనాలు సీజ్?