C Voter – ABP: బీజేపీ వైపే… గుజరాత్ ఓటర్ల చూపు…!!
- By hashtagu Published Date - 08:46 AM, Sat - 5 November 22

గుజరాత్ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వేడి రాజేసుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సారీ ఆప్ కూడా గుజరాత్ లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించింది ఆప్. డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు విశేష్ (ఎక్స్ క్లూజివ్ ) C Voters – ABP ద్వారా ఒపీనియన్ పోల్ నిర్వహించారు. ఇందులో అధికార భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే తెలిపింది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 131 నుంచి 182 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లలో విజయం సాధించింది. 2017 లో కాంగ్రెస్ 77సీట్లురాగా…ఈ సారి 31 నుంచి 39 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో 7 నుంచి 15 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 2017 ఎన్నికల్లో గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి లేదు. కానీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బలమైన పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆప్ చీల్చుతుందని… దీంతో కాంగ్రెస్ కు సంబంధించిన సగం ఓట్లు ఆప్ కు పడనున్నాయని సర్వే సూచించింది.
Also Read: Gujarat: 43 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసిన కాంగ్రెస్..!!
ఒపీనియన్ పోల్ పై గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ స్పందించారు. మేము ఈ సర్వే లో వచ్చిన సీట్ల కంటే మేము ఎక్కువగా ఆశీస్తున్నాము. ఆప్ కు సంబంధించినంతవరకు గుజరాత్ లో ఒక స్థానంలో గెలవదు. కాంగ్రెస్, ఆప్ ల ఒపీనియన్ పోల్ ను తిరస్కరించాయి. ఇది ఓటర్లను తప్పుదోబ పట్టించేందుకే అన్నారు.
అయితే ఈ ఒపీనియన్ పోల్స్ తప్పని గతంలో నాలుగు సార్లు రుజువైందని కాంగ్రెస్ అధికారి ప్రతినిధి అమిత్ నాయక్ అన్నారు. అధికార వ్యతిరేక ఓట్లను విభజించేందుకే బీజేపీ, ఆప్, ఏఐఎంఐఎంలను గజరాత్ కు తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈసారి బీజేపీ వ్యూహం విఫలమవుతుందన్నారు. ఎందుకంటే ఆప్ బీజేపీకి ‘బి’ టీమ్ అని ప్రజలు గ్రహించారు. ఒపీనియన్ పోల్స్‌కు విరుద్ధంగా గుజరాత్‌లో కాంగ్రెస్ కనీసం 125 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేవారు.
Also Read: Air Pollution: కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి..!
ఢిల్లీలో మూడు సార్లు, పంజాబ్‌లో ఒకసారి సర్వేలు పూర్తిగా తప్పు అని ప్రజలు నిరూపించారు. గుజరాత్ ఎన్నికలలో కూడా ఇది పునరావృతమవుతుంది. ఎందుకంటే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారని ఆప్ అధికార ప్రతినిధి యోగేష్ జద్వానీ అన్నారు.
ఒపీనియన్ పోల్స్ అంచనా వేసినట్లుగా ఆప్ 20 శాతం ఓట్లను సాధిస్తే, అది అధికార పార్టీ (బీజేపీ) ఓట్ల శాతాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గోహిల్ అన్నారు. ఆప్ ఉనికి వల్ల బీజేపీకి భారీగా లబ్ధి చేకూరుతోందని ప్రాథమిక సంకేతాలు ఉన్నాయని.. అయితే పరిస్థితులు మారవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి!